STOCKS

News


వీటిని కొనొచ్చా?

Tuesday 2nd October 2018
Markets_main1538470060.png-20795

బీఈఎల్‌, అవంతి ఫీడ్స్‌ స్టాక్స్‌ను హోల్డ్‌ చేయవచ్చని, సుజ్లాన్‌, మిందా ఇండస్ట్రీస్‌ షేర్లను విక్రయించొచ్చని సిఫార్సు చేస్తున్నారు ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ ఫౌండర్‌ జి.చొక్కాలింగం. ఆయన ఒక ఆంగ్ల చానల్‌లో...ఇంకా ఏం చెప్పారో ఆయన మాటాల్లోనే..

ప్ర: నేను రూ.3,700 వద్ద 500 లక్ష్మీ మెషీన్‌ వర్క్స్‌ షేర్లు కొన్నాను. అలాగే రూ.175 వద్ద 20,000 మిందా ఇండస్ట్రీస్‌ షేర్లు కొనుగోలు చేశాను. వీటిని ఇంకా హోల్డ్‌ చేయవచ్చా?
లక్ష్మీ మెషీన్‌ వర్క్స్‌ మేనేజ్‌మెంట్‌ బాగుంది. అయితే 2016 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ ప్రాఫిట్‌, రెవెన్యూలో చెప్పుకోదగ్గ వృద్ధి లేదు. స్టాక్‌ అధిక వ్యాల్యుయేషన్స్‌ వద్ద ట్రేడవుతోంది. షేరు ధర 5-10 శాతం పెరిగితే విక్రయించొచ్చు. మిందా ఇండస్ట్రీస్‌ కూడా అధిక వ్యాల్యుయేషన్స్‌తో ట్రేడవుతోంది. స్టాక్‌ ధర పెరిగితే వచ్చే ఆరు నెలల కాలంలో దీన్ని విక్రయించొచ్చు. 

ప్ర: నా వద్ద 900 సన్వారియా కన్సూమర్‌ షేర్లు ఉన్నాయి. సగటున చూస్తే ఒక్కో షేరుకు రూ.18 వెచ్చించాను. వీటిని హోల్డ్‌ చేయవచ్చా? లేదా విక్రయించాలా?
టార్గెట్‌ ప్రైస్‌ రూ.14 వచ్చే వరకు హోల్డ్‌ చేయవచ్చు.

ప్ర: రూ.280 ధర వద్ద 600 ఎడిల్‌వీజ్‌ షేర్లను, రూ.505 ధర వద్ద 450 హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలి?
ఎడిల్‌వీజ్‌ వ్యాల్యుయేషన్స్‌ సబబుగానే ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరపు కన్సాలిడేటెడ్‌ బుక్‌ వ్యాల్యుకి 2.6 రెట్లు వద్ద ట్రేడవుతోంది. స్వల్ప కాలంలో రూ.220 టార్గెట్‌ ప్రైస్‌తో వీటిని హోల్డ్‌ చేయవచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అధిక వ్యాల్యుయేషన్స్‌తో ఉంది. వృద్ధి అవకాశాలు, సమర్థవంతమైన మేనేజ్‌మెంట్‌ కారణంగా ఈ స్టాక్‌ను దీర్ఘకాలంలో హోల్డ్‌ చేయవచ్చు.

ప్ర: రూ.107 ధర వద్ద 1,100 బీఈఎల్‌ షేర్లను, రూ.860 వద్ద 100 అమర రాజా బ్యాటరీస్‌ షేర్లను, రూ.30 వద్ద 300 సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను కొనుగోలు చేశాను. ఏం చేయాలో సలహా ఇవ్వండి?
బీఈఎల్‌, అమర రాజా బ్యాటరీస్‌ షేర్లను మీరు పెట్టిన డబ్బులు వచ్చే వరకు హోల్డ్‌ చేయవచ్చు. కొత్త ప్రైసింగ్‌ పాలసీ వల్ల బీఈఎల్‌ ఎక్కువ కరెక‌్షన్‌కు గురయ్యింది. ప్రస్తుతం అమర రాజా బ్యాటరీస్‌ ఆమోదయోగ్యమైన వ్యాల్యుయేషన్స్‌తో ట్రేడవుతోంది. రూ.15 టార్గెట్‌ ప్రైస్‌తో సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను హోల్డ్‌ చేయవచ్చు. ఇది తక్కువ వ్యాల్యుయేషన్స్‌తో ట్రేడవుతోంది. 

ప్ర: నా వద్ద 1,000 టాటా మోటార్స్‌ షేర్లు, 2,500 హాత్‌వే షేర్లు ఉన్నాయి. ఏం చేయాలి?
యూకే మార్కెట్‌లో అస్థిరతల వల్ల టాటా మోటార్స్‌ నుంచి మారుతీకి లేదా జై భారత్‌ మారుతీకి మారండి. ఏ కొంచెం అప్‌సైడ్‌ వచ్చినా కూడా హాత్‌వే కేబుల్స్‌ను విక్రయించొచ్చు. ఈ కంపెనీకి రూ.1,000 కోట్ల రుణ భారం ఉంది. 

ప్ర: 2018 జనవరిలో రూ.40.7 ధర వద్ద 1,000 వికాస్‌ ఎకోటెక్‌ షేర్లను కొనుగోలు చేశారు. నేను దీర్ఘకాల ఇన్వెస్టర్‌ని. ఈ షేర్లను హోల్డ్‌ చేయవచ్చా?
కంపెనీ నికర లాభం గత నాలుగేళ్లలో 7 రెట్లుకుపైగా పెరిగింది. అయినా కూడా కంపెనీ షేరుకు 5 పైసలు మించి ఎక్కువ డివిడెండ్‌ను ఇవ్వలేదు. ఈ అంశమే స్టాక్‌పై విశ్వాసాన్ని నింపలేకపోతోంది. అందువల్ల ఈ స్టాక్‌ రూ.20 దగ్గరకు వస్తే విక్రయించొచ్చు. 

ప్ర: నేను రూ.1,383 వద్ద 275 ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లను కొనుగోలు చేశాను. ఏం చేయాలి. షేరు టార్గెట్‌ ధర ఎంత?
ఎయిర్‌లైన్స్‌ బిజినెస్‌పై వృద్ధి అంచనాలు బాగున్నాయి. అయితే కంపెనీల పనితీరు క్రూడ్‌ ధరలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ క్రూడ్‌ ధర 20 శాతానికిపైగా పడిపోతే.. అప్పుడు స్టాక్‌ ధర.. మీరు కొన్న ధర వద్దకు పెరగొచ్చు. అందువల్ల ఈ స్టాక్‌ను దీర్ఘకాలంలో హోల్డ్‌ చేయవచ్చు. అయితే క్రూడ్‌ ధరలపై కన్నేసి ఉంచండి.

ప్ర: నా వద్ద 8,000 యూనిటెక్‌ షేర్లు, 1,800 సుజ్లాన్‌ షేర్లు ఉన్నాయి. యూనిటెక్‌ షేర్లను రూ.4.3 వద్ద, సుజ్లాన్‌ షేర్లను రూ.8.2 వద్ద కొనుగోలు చేశాను? ఏం చేయాలి?
రెండు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. అలాగే వీటికి రుణ భారం ఎక్కువగా ఉంది. అందువల్ల వీటిని హోల్డ్‌ చేయడం లాభదాయకం కాదు. వీటిల్లో ఏ కొంచెం అప్‌సైడ్‌ కనిపించినా కూడా విక్రయించొచ్చు. 

ప్ర: షేరుకు రూ.475 చెల్లించి 100 అవంతి ఫీడ్స్‌ షేర్లను, రూ.13.5 చెల్లించి 1,000 జేపీ అసోసియేట్స్‌ షేర్లను కొన్నాను. వీటిని హోల్డ్‌ చేయాలా?  విక్రయించాలా? 
రూ.450 టార్గెట్‌ ధరతో అవంతి ఫీడ్స్‌ షేర్లను హోల్డ్‌ చేయవచ్చు. జేపీ అసోసియేట్స్‌ నుంచి ఎగ్జిట్‌ అవ్వడానికి.. స్టాక్‌ ధర పెరిగే వరకు వేచి ఉండండి. 

ప్ర: నా వద్ద 300 జీవీకే పవర్‌ షేర్లు, 300 ఇండో సోలార్‌ స్టాక్స్‌ ఉన్నాయి. జీవీకే పవర్‌ స్టాక్స్‌ను రూ.16 వద్ద, ఇండో సోలార్‌ స్టాక్స్‌ను రూ.9 వద్ద కొనుగోలు చేశాను. ఏం చేయాలో సలహా ఇవ్వండి?
జీవీకే పవర్‌ షేర్లు రూ.10 వరకు రికవరీ అయ్యే వరకు హోల్డ్‌ చేయవచ్చు. వార్షిక ఆదాయంతో పోలిస్తే కంపెనీ రుణం ఎక్కువగా ఉండటం వల్ల ఇండో సోలార్‌ స్టాక్స్‌ను విక్రయించొచ్చు. You may be interested

మీ మార్కెట్‌ పెట్టుబడులపై వీటి ఎఫెక్ట్‌..

Tuesday 2nd October 2018

మిడ్‌క్యాప్స్‌ పతనం, రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ ఆందోళనలు.. వీటన్నింటినీ మార్కెట్‌ చూసేసింది. మార్కెట్‌ గత శుక్రవారం ఒక్క దెబ్బతో ఇన్వెస్టర్ల సంపదను ఊడ్చుకెళ్లింది. ప్రస్తుత ఒడిదుడుకుల మీ పోర్ట్‌ఫోలియో సురక్షింతంగా ఉందా? వచ్చే ఆరు నెలల కాలంలో ఏ ఏ అంశాలు స్టాక్స్‌ రిటర్న్స్‌ను ప్రభావితం చేయబోతున్నాయి? ఒకసారి చూడండి..  రూపాయి ప్రస్తుత ఏడాది రూపాయి 13 శాతంమేర పతనమైంది. ఆసియా ప్రాంతంలో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన

85 డాలర్లస్థాయిని దాటిన బ్రెంట్‌ క్రూడ్‌

Tuesday 2nd October 2018

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు చల్లారడం లేదు. ఇరాక్‌ చమురు ఎగుమతులపై అమెరికా వచ్చే నెల నుంచి ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం బ్రెంట్‌ క్రూడాయిల్‌ నాలుగేళ్ల గరిష్ట ధర 85.45 డాలర్ల స్థాయికి ఎగసింది. మంగళవారం ఆసియా మార్కెట్లో ఉదయం 12 గంటల సమయానికి బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్‌ ధర 85.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇరాన్‌ చమురు ఎగుమతులపై అమెరికా విధించిన రెండో

Most from this category