STOCKS

News


దివాలా కంపెనీలపై కుబేరుల మక్కువ

Thursday 9th August 2018
Markets_main1533802433.png-19097

దివాలాప్రక్రియ ఎదుర్కొంటున్న పలు స్మాల్‌క్యాప్స్‌పై దేశీయ హెచ్‌ఎన్‌ఐలు(హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌) ఇటీవల కాలంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 22 చిన్న కంపెనీల్లో ఇటీవల కాలంలో హెచ్‌ఎన్‌ఐలు వాటా పెంచుకున్నారు. వీటిలో పలు కంపెనీలు దివాలా తీసినవి కావడం గమనార్హం. ఇవన్నీ ఆయా కోర్టుల ముందు విచారణలు ఎదుర్కొంటున్నాయి. మార్చి పతనం నుంచి ప్రధాన సూచీలు కోలుకున్నా స్మాల్‌క్యాప్‌ సూచీ మాత్రం ఇంకా ఆల్‌టైమ్‌ హై నుంచి 16 శాతం దిగువనే ఉంది. అయితే కొన్ని కంపెనీల షేర్లలో మాత్రం ఊహించని కొనుగోళ్లు జరుగుతున్నాయి. 2016 నుంచి 22 స్మాల్‌ క్యాప్స్‌లో హెచ్‌ఎన్‌ఐలు నిరంతరాయంగా పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. సాధారణంగా హెచ్‌ఎన్‌ఐలు రిటైల్‌ ఇన్వెస్టర్ల కన్నా ఎక్కువ రిస్కుకు సిద్ధంగా ఉంటారు. ఇటీవల పతనంలో సైతం వారు అమ్మకాలకు దిగలేదు. 
ఇలా హెచ్‌ఎన్‌ఐలు మక్కువ చూపుతున్న కొన్ని కౌంటర్ల వివరాలు...
- ఎంబీఎల్‌ ఇన్‌ఫ్రా: 2016లో ఈ కంపెనీలో హెచ్‌ఎన్‌ఐల వాటా 3.03 శాతం కాగా గత జూన్‌ నాటికి ఈ వాటా 23.46 శాతానికి చేరింది. మరోపక్క ఇదే సమయంలో ఈ కౌంటర్లో ఎంఎఫ్‌ల వాటా 21.4 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయింది. గత ఏడాది ఈ స్టాకు 14 శాతం పతనమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ ఐపీ ప్రక్రియకు అంగీకరించింది. 
- కేఎస్‌కే ఎనర్జీ: రెండేళ్లలో ఈ కౌంటర్లో కుబేరుల కోటా ఒక్క శాతం నుంచి 18.61 శాతానికి దూసుకుపోయింది. ఇదే సమయంలో ఎంఎఫ్‌ల వాటా 11.6 శాతం నుంచి 6.4 శాతానికి దిగివచ్చింది. 
- స్పెషాలిటీ రెస్టారెంట్స్‌: హెచ్‌ఎన్‌లు ఈ కంపెనీలో వాటాని 18.5 శాతం నుంచి 19.23 శాతానికి పెంచుకున్నారు. 
- అలోక్‌ ఇండస్ట్రీస్‌: ఎన్‌సీఎల్‌టీ అహ్మదాబాద్‌ బ్రాంచ్‌ ముందు ఈ కంపెనీ దివాలా పిటీషన్‌ విచారణలో ఉంది. ఇందులో హెచ్‌ఎన్‌ఐలు భారీగా వాటాలు కొన్నాయి. 
- మోనెట్‌ ఇస్పాత్‌: ముంబై ఎన్‌సీఎల్‌టీ బ్రాంచ్‌లో ఈ కంపెనీ దివాలా ప్రక్రియ నడుస్తోంది. 
- రామ్‌కీ ఇన్‌ఫ్రా: ఎన్‌సీఎల్‌టీ, ఏపీ టీఎస్‌ హైకోర్టులో విచారణలు ఎదుర్కొంటోంది. 
- వీటితో పాటు గామన్‌ ఇన్‌ఫ్రా, సుప్రీం ఇన్‌ఫ్రా, పారాబొలిక్‌ డ్రగ్స్‌, మాన్‌ ఇండస్ట్రీస్‌; ఇన్నోవాసీంత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, రతన్‌ ఇండియా పవర్‌, అసోసియేటెడ్‌ ఆల్కహాల్స్‌, ఆస్త్రాజెన్‌కా ఫార్మా, హెచ్‌ఎస్‌ ఇండియా, గుజరాత్‌ మెటాలిక్‌ కోల్‌ అండ్‌ కోక్‌, బీఏజీ ఫిల్మ్స్‌, రోల్టా ఇండియా కంపెనీల షేర్లలో సైతం హెచ్‌ఎన్‌ఐలు వాటాలు పెంచుకున్నాయి. You may be interested

విజయా బ్యాంక్‌తో బజాజ్‌ అలియాంజ్‌ జట్టు

Thursday 9th August 2018

దేశీ ప్రముఖ ప్రైవేట్‌ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌.. ప్రభుత్వ రంగ విజయా బ్యాంక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా విజయా బ్యాంక్‌ తనకు దేశవ్యాప్తంగా 2,129 శాఖల్లో బజాజ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులను కస్టమర్లకు విక్రయించనుంది. దీని వల్ల ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద, ఇంటి, మోటార్‌, ట్రావెల్‌ బీమా సహా ప్రాపర్టీ, లయబిలిటీ, మెరైన్‌, ఇంజనీరింగ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులు బ్యాంక్‌ కస్టమర్లకు అందుబాటులో

ఎంఫసిస్‌ బైబ్యాక్‌.. 17 శాతం దాకా రిటర్న్‌..

Thursday 9th August 2018

ఐటీ సంస్థ ఎంఫసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీని కోసం రూ.988 కోట్లు వెచ్చించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని పేర్కొంది. ఇప్పుడు కంపెనీ షేర్లను కొనుగోలు చేసి, బైబ్యాక్‌లో పాల్గొంటే మంచి రాబడి అందుకోవచ్చని తెలిపింది. ఎంఫసిస్‌ 73.2 లక్షల షేర్లను (ఈక్విటీలో 3.79 శాతం) టెండర్‌ ఆఫర్‌ ద్వారా షేరుకు రూ.1,350 చెల్లించి కొనుగోలు చేయనుంది. మధ్యాహ్నం 1:00 సమయంలో ఎంఫసిస్‌ షేర్లు

Most from this category