STOCKS

News


ఎన్నికలొస్తే మార్కెట్‌కు పండుగే!

Tuesday 9th October 2018
Markets_main1539073721.png-20978

ఎలక‌్షన్స్‌ అనంతరం ర్యాలీకే ఎక్కువ ఛాన్స్‌
మార్కెట్లలో ప్రవేశించేందుకు ఇదే మంచి తరుణమా? అవునంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఎన్నికలకు ముందు మార్కెట్లో ప్రవేశిస్తే ఎన్నికల అనంతరం మంచి లాభాలతో బయటకు రావచ్చంటున్నారు. ఇందుకు గత నిదర్శనాలను చూపుతున్నారు. గత 27 సంవత్సరాల డేటా పరిశీలిస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఎన్నికలయ్యాక రెండేళ్లలో సూచీలు భారీ లాభాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దఫా మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నందున ఈ సారి కూడా ఇదే మ్యాజిక్‌ రిపీటవుతుందని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో దేశీయ సూచీల వాల్యూషన్లు చాల ఎక్కువగా ఉండేవి. తాజా పతనంతో వాల్యూషన్లు భారీగా దిగివచ్చాయి. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రస్తుతం మంచి అవకాశంగా బుల్స్‌ భావిస్తున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా భారత మార్కెట్లు దీర్ఘకాలిక బుల్‌రన్‌లో ఉన్నాయనని, అందువల్ల లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులకు తాజా కరెక‌్షన్‌ను ఉపయోగించుకోవాలని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సూచిస్తోంది. 


23 శాతం సరాసరి రాబడులు..
గత గణాంకాలు చూస్తే ఎన్నికలకు ఆరునెలల ముందు మార్కెట్లో కొనుగోళ్లు చేసి ఎన్నికల అనంతరం రెండేళ్లపాటు వెయిట్‌ చేసిన ఇన్వెస్టర్లకు సరాసరిన 23 శాతం వరకు లాభాలు వచ్చాయని సాంక్టమ్‌ వెల్త్‌ నివేదిక తెలిపింది. గత 3 దశాబ్దాల్లో 2009 ఎన్నికల వేళ అత్యధిక రాబడులు(51.9 శాతం) రాగా, 1999 ఎన్నికల వేళ అల్పరాబడులు(1.5 శాతం) వచ్చాయి. ఎన్నికల్లో అప్పటివరకు ఉన్న ప్రభుత్వం గెలిచినా, కొత్త ప్రభుత్వం ఎన్నికైనా మార్కెట్లలో లాభాలకు మాత్రం ఇంతవరకు ఢోకా రాలేదు. గత ఎన్నికలను పరిశీలిస్తే 2013లో కొనుగోళ్లు చేసిన ఇన్వెస్టర్లకు 2015 చివరి నాటికి దాదాపు 14.3 శాతం రాబడి వచ్చింది. ఇవన్నీ పరిశీలిస్తే ప్రస్తుత పతనంలో ఈక్విటీల్లో పెట్టుబడులకు మంచి అవకాశమని బ్రోకరేజ్‌ సంస్థలు సలహా ఇస్తున్నాయి. ఇలాంటి బేర్‌ మార్కెట్లు తదుపరి బుల్‌మార్కెట్లకు పునాదిలాగా పనిచేస్తాయని చెబుతున్నాయి. అమెరికాలో సైతం 2008లో వచ్చిన బేర్‌ మార్కెట్‌ 2009లో ఆరంభమైన బుల్‌ మార్కెట్‌కు పునాదిగా పనిచేసింది. అందువల్ల ఈ అవకాశం వదులుకోవద్దన్నది  ఎక్కువమంది సూచన. You may be interested

ఏడాది లక్ష్యంతో మిడ్‌క్యాప్స్ ఓకే..

Tuesday 9th October 2018

మిడ్‌క్యాప్స్‌లో వ్యాల్యుయేషన్స్‌ తక్కువగా ఉన్నాయని ఎలారా సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీ) రవి సుందర్‌ ముత్తుకృష్ణన్‌ తెలిపారు. అయితే వీటిల్లో మరికొంత డౌన్‌సైడ్‌ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్లకు ఇది సరైన సమయం కాదని, అయితే ఏడాది లక్ష్యంతో నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సిఫార్సు చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  భారత్‌లో ప్రస్తుతం రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, ద్రవ్యలోటు

అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Tuesday 9th October 2018

ముంబై:- మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా మంగళవారం మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతం నష్టపోయింది. అత్యధికంగా సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం పతనమవ్వగా, విజయా బ్యాంక్‌ 1.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, యూనియన్‌

Most from this category