STOCKS

News


హెక్సావేర్‌కు క్యూ2 ఫలితాలు షాక్‌

Thursday 25th October 2018
Markets_main1540447538.png-21477

ముం‍బై:- హెక్సావేర్‌ షేరుకు ఆ కంపెనీ క్యూ2 ఫలితాలు షాక్‌నిచ్చాయి. విశ్లేషకులు ఆశించిన స్థాయిలో క్యూ2 ఫలితాలు నమోదు కాకపోవడంతో గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు ఏకంగా 9శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.330.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో 9శాతం క్షీణించి రూ.337.50ల కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.350.7)తో పోలిస్తే 6శాతం పతనమై రూ.329.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 276.00, రూ.557.40లుగా నమోదయ్యాయి.
హెక్సావేర్‌ క్యూ2 ఫలితాలు:-
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో హెక్సావేర్‌ టెక్నాలజీస్ నికర లాభం 21 శాతం పెరిగి రూ. 172 కోట్లను సాధించింది. మొత్తం ఆదాయం 7 శాతం వృద్ధి చెంది రూ. 1210 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 18శాతం సాధించి రూ.187 కోట్లకు పెరిగింది. కంపెనీ 2018–19 సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.50 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది.



You may be interested

బేర్‌ పట్టు బిగుస్తోంది!

Thursday 25th October 2018

ప్రపంచ మార్కెట్లపై క్రమంగా పెరుగుతున్న బేర్స్‌ ఆధిపత్యం కరెక‌్షన్‌ మూడ్‌లోకి పలు దేశాల ఈక్విటీలు ప్రపంచ పెద్దన్న యూఎస్‌ఏ మార్కెట్‌ ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 2.5 శాతం లాభంలో ఉంది. అయితే యూఎస్‌ఏ మార్కెట్లను చూసి ప్రపంచ ఈక్విటీలన్నీ బాగానే ఉన్నాయనుకుంటే పొరపాటని, వరల్డ్‌ మార్కెట్లన్నీ ఒకదాని వెనుక ఒకటి బేర్‌ గుప్పిట్లో గట్టిగా చిక్కుకున్నాయని రాయిటర్స్‌ డేటా చెబుతోంది. ప్రపంచ మార్కెట్ల పనితీరును ఎంఎస్‌సీఐ- ఆల్‌ కంట్రీ వరల్డ్‌ ఇండెక్స్‌

స్టాక్‌ ఇన్వెస్టర్లకు డివిడెండ్లు మంచి స్నేహితులు: బోగ్లే

Thursday 25th October 2018

డివిడెండ్లు అన్నవి సంపద సృష్టికి ఉపయోగపడతాయని, అవి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికి మంచి స్నేహితులని ప్రముఖ అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ వ్యాన్‌గార్డ్‌ వ్యవస్థాపకుడు జాన్‌ సి బోగ్లే అన్నారు. ముంబైలో మార్నింగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు సందర్భంగా వీడియో ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. డివిడెండ్లకు ఉన్న కాంపౌండింగ్‌ శక్తి అద్భుతమని బోగ్లే పేర్కొన్నారు. దీర్ఘకాలంలో కార్పొరేట్‌ ఆదాయాలు, డివిడెండ్‌ రాబడి స్టాక్‌ ధరలను ముందుకు నడిపిస్తాయని

Most from this category