STOCKS

News


ఆర్‌ఐఎల్‌ షేరుపై అనలిస్టుల అంచనాలివి..

Friday 19th April 2019
Markets_main1555671040.png-25233

మార్చి క్వార్టర్‌లో రికార్డు లాభాలను ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేరు సోమవారం(ఏప్రిల్‌ 22న) ట్రేడింగ్‌ను పాజిటివ్‌గా ప్రారంభించవచ్చని షేర్‌ఖాన్‌ బ్రోకరింగ్‌ సంస్థ సీనియర్‌ విశ్లేషకుడు అభిజిత్‌ బోరా అభిప్రాయపడుతున్నారు. స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌) 8.2 డాలర్లు నమోదైంది. ఇది సింగపూర్‌ జీఆర్‌ఎమ్‌ కంటే అధికంగా ఉందని ఆయన్నారు. కన్జ్యూమర్‌ వ్యాపారాలైన రీటైల్‌, జియో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ ఆయా రంగాల మార్జిన్లు పెరిగాయి. ఇక ముందస్తు అంచనాలకు అనుగుణంగానే చమురు శుద్ధి, పెట్రో కెమికల్‌ విభాగాల మార్జిన్లు తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు. 
అయితే, 
రీఫైనింగ్‌ విభాగంలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాటు  లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉన్నందున్న సోమవారం (ఏప్రిల్‌ 22న) రిలయన్స్‌ షేరు నష్టాల బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకుడు ఎస్‌పీ తులసియన్‌ అంచానా వేస్తున్నారు. ‘‘రిటైల్‌, డిజిటల్‌ వ్యాపారాలు రాణించాయి. అయితే రిఫైనింగ్‌ వ్యాపార వృద్ధి జరగలేదు. ఈ నేపథ్యంలో సోమవారం బహుశా రిలయన్స్‌ షేరు ర్యాలీ ఆగిపోవచ్చని, అటుపై లాభాల స్వీకరణ జరగవచ్చు’’ అని ఆయనంటున్నారు. స్థూల రిఫైనింగ్‌, పెట్రో కెమికల్స్‌ మార్జిన్‌ తగ్గడంతో నికరలాభం వృద్ధి 3శాతానికి  పరిమితం కావడం నిరాశపర్చిందని తులసియన్‌ అన్నారు. 



You may be interested

భారతీ ఎయిర్‌టెల్‌కు రైట్స్‌ ఇష్యూతో బలం!

Friday 19th April 2019

భారతీ ఎయిర్‌టెల్‌ భారీ రైట్స్‌ ఇష్యూ మే 3న ప్రారంభమై 17వ తేదీన ముగియనుంది. రైట్స్‌ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం మీద రూ.25,000 కోట్లను సమీకరించనుంది. రైట్స్‌ ఇష్యూలో పాల్గొనేందుకు రికార్డ్‌ తేదీగా ఏప్రిల్‌ 24ను కంపెనీ ఖరారు చేసింది. ఈ తేదీ నాటికి వాటాదారులుగా ఉన్న వారికే రైట్స్‌ ఇష్యూలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇష్యూ కంపెనీకి లాభించే అంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.    రైట్స్‌ ఇష్యూ ద్వారా

క్రూడ్‌ మరింత ప్రియం?!

Friday 19th April 2019

ఆనంద్‌ రాఠీ అంచనా ఒపెక్‌ ఉత్పత్తికోతల ప్రభావం ముడిచమురు ధరపై బాగానే కనిపిస్తోంది. ఫిబ్రవరితో పోలిస్తే ఒపెక్‌ రోజువారీ చమురు ఉత్పత్తిలో దాదాపు 5లక్షల బ్యారెళ్ల క్షీణత నమోదయింది. సౌదీ అరేబియా, వెనెజులా, ఇరాక్‌లో ఉత్పత్తి భారీగా పతనం కావడం చమురు ధరపై పడింది. తిరిగి ముడిచమురు ధరలో సమతుల్యం వచ్చేవరకు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటామని సౌదీ ప్రకటిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిలో మరింత కోతలు విధించేందుకు కూడా రెడీ అంటోంది. ఈ

Most from this category