News


ఎఫ్‌ఐఐలు మక్కువ చూపుతున్న షేర్లివే!

Tuesday 2nd April 2019
Markets_main1554198505.png-24930

మార్చినెల్లో విదేశీ మదుపరులు దేశీ మార్కెట్లో నిధుల వెల్లువ పారించారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎఫ్‌ఐఐలు 1.50 లక్షల కోట్ల రూపాయల నికర కొనుగోళ్లు, 1.16 లక్షల కోట్ల రూపాయల నికర అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చిల్లో ఎఫ్‌ఐఐలు విపరీతంగా కొనుగోళ్లు జరిపాయి. దీంతో సూచీలు ఒక్కమారుగా ర్యాలీ జరిపి రికార్డులను చేరుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రేట్‌కట్‌ నిర్ణయాలు వస్తే భారత ఈక్విటీల్లోకి మరింతగా ఎఫ్‌ఐఐ ప్రవాహం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత కూడా విదేశీ నిధుల వెల్లువ స్థిరంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 
61 కౌంటర్లు
గత నాలుగు వరుస త్రైమాసికాలుగా ఎఫ్‌ఐఐలు 61 కంపెనీల్లో వాటాలను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాయి. వీటిలో అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఆగ్రోటెక్‌, అమర్‌రాజా బ్యాటరీస్‌, అతుల్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఎవెన్యూ సూపర్‌మార్ట్‌, సెంచరీ టెక్స్‌టైల్స్‌, ఐసీఐసీఐ లుంబార్డ్‌, ఇండియా బుల్స్‌ వెంచర్స్‌, జేఎస్‌డబ్ల్యు హోల్డింగ్స్‌, కేసీపీ, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్, కిరి ఇండస్ట్రీస్‌, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ తదితరాలున్నాయి. వీటిలో చాలా షేర్లపై దేశీయ బ్రోకరేజ్‌లు కూడా బుల్లిష్‌గా ఉన్నాయి. ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు పెట్టిన పై కంపెనీల్లో దాదాపు 44 కంపెనీలు గత రెండు నెలల్లో 35 శాతం వరకు ర్యాలీ జరిపాయి. రెండు డజన్లకు పైగా కంపెనీలు 115 శాతం వరకు దూసుకుపోయాయి. డిసెంబర్‌ డేటా ప్రకారం చూస్తే ఎఫ్‌ఐఐలకు అత్యంత అధికంగా హెచ్‌డీఎఫ్‌సీలో(72.2 శాతం) వాటాలున్నాయి. తర్వాత స్థానాల్లో సోరిల్‌ ఇన్‌ఫ్రా, టీసీఐ ఎక్స్‌ప్రెస్‌; సువెన్‌లైఫ్‌, ఇంటర్నేషనల్‌ పేపర్‌ ఏపీపీఎం తదితరాలున్నాయి. You may be interested

సైయంట్‌ 12 శాతం క్రాష్‌

Tuesday 2nd April 2019

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీ సైయంట్‌  లిమిటెడ్‌ షేర్లు మంగళవారం 12శాతం పతనమయ్యాయి. కంపెనీకి ఇటీవల దక్కిన ఆర్డర్లు వాయిదా పడటం షేర్ల పతనానికి కారణమైంది. నేడు  సైయంట్‌  షేర్లు బీఎస్‌ఈలో రూ.645.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రెగ్యూలేటరీ క్లియరెన్సీ ఇవ్వకపోవడంతో సుమారు 5మిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు వాయిదా పడినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సం‍వత్సరంలో కంపెనీ ఆదాయాలు తగ్గవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా చేయడం కూడా

125 స్టాకుల్లో బుల్లిష్‌ ఎంఏసీడీ క్రాసోవర్‌

Tuesday 2nd April 2019

దేశీయ సూచీల్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయని టెక్నికల్‌ చార్టులు చూపుతున్నాయి. సోమవారం ముగింపు ప్రకారం 125 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జిందాల్‌స్టీల్‌, అపోలోటైర్స్‌, జేకే టైర్స్‌, యూకో బ్యాంక్‌, ఐఓబీ,

Most from this category