STOCKS

News


రూపీ పతనాన్ని అడ్డుకునే అస్త్రాలు..

Friday 14th September 2018
Markets_main1536908286.png-20249

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ జీవిత కాల కనిష్ట స్థాయిలకు పతనమైంది. దాదాపు 73 దగ్గరకు క్షీణించింది. ఈ ఏడాది ఇప్పటిదాకా 13 శాతంపైనే పతనమైంది. అధిక డాలర్ల చెల్లింపుల వల్ల రూపాయి మారక విలువ తగ్గింది. స్థూల ఆర్థికాంశాలు బలంగా ఉన్నాయి. క్యూ1లో అంచనాలు మించిన జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండటం వంటివి ఇందుకు ఉదాహరణ. ఫారెక్స్‌ నిల్వలు కూడా ఆరోగ్యకరంగానే ఉన్నాయి. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ల పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. అలాగే కేం‍ద్ర ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ అంశాలను వెల్లడించింది. అలాగే రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు పాలసీ రూపకర్తల వద్ద ఎలాంటి అస్త్రాలున్నాయో తెలియజేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. 

ఫారెక్స్‌ మార్కెట్‌లో జోక్యం: 
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ.. ఫారెక్స్‌ మార్కెట్‌లో జోక్యం చేసుకోవచ్చు. డాలర్లను విక్రయించి రూపాయి కొనుగోలు చేయవచ్చు. అప్పుడు రూపాయికి డిమాండ్‌ పెరిగి, విలువ మెరుగుపడుతుంది. 

వడ్డీ రేట్ల పెంపు:
ఆర్‌బీఐ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఎక్కువ కాలం జోక్యం చేసుకోలేకపోవచ్చు. మన వద్ద ఉన్న ఫారెక్స్‌ నిల్వలతో కొంత కాలం వరకు మాత్రమే పరిస్థితి అదుపులో ఉంచుకోవచ్చు. అందువల్ల ఆర్‌బీఐ.. వడ్డీ రేట్ల పెంపు అస్త్రాన్ని ప్రయోగించొచ్చు. ద్రవ్యోల్బణ అంచనాలు దిగువ స్థాయిల్లోనే ఉండటం వల్ల రేట్లు పెంపు ఉండకపోవచ్చు. అయితే కరెన్సీపై ఒత్తిడి ఇలాగే కొనసాగితే మాత్రం అక్టోబర్‌లో 25-50 బేసిస్‌ పాయింట్ల మేర రేట్లు పెంపు ఉండొచ్చు. 

స్వాప్‌ లైన్స్‌ బలోపేతం:
అభివృద్ధి చెందిన దేశాల విదేశీ సెంట్రల్‌ బ్యాంకులతో డాలర్‌ స్వాప్‌ లైన్స్‌ను పటిష్టం చేసుకోవడం మరో మార్గం. కరెన్సీ స్వాప్‌ లైన్‌ అనేది రెండు సెంట్రల్‌ బ్యాంకుల మధ్య కుదిరిన కరెన్సీ ఎక్స్చేంజ్‌ ఒప్పందం. ఇందులో ఒక పరిమితికి లోబడి ఇరు కేంద్ర బ్యాంకులూ వాటి కరెన్సీలను పరస్పరం మార్పిడి చేసుకోవొచ్చు.

క్రూడ్‌ దిగుమతి కంపెనీలకు స్పెషల్‌ స్వాప్‌ విండో:
ఆర్‌బీఐ క్రూడ్‌ దిగుమతి కంపెనీల కోసం ప్రత్యేకమైన స్వాప్‌ విండో ఏర్పాటు చేయవచ్చు. 2013లోనూ రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఈ విధానాన్ని అవలభించింది. ఆయిల్‌ కంపెనీలు డాలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాయి. అందువల్ల వీటి కోసం ఆర్‌బీఐ ఫారెక్స్‌ స్వాప్‌ విండోను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఆర్‌బీఐ ఒక బ్యాంక్‌ ద్వారా ఆయిల్‌ కంపెనీల నుంచి రూపాయిలను తీసుకొని, వాటికి సమాన మొత్తంలో డాలర్లను అందిస్తుంది. ఒక నిర్ణీత కాలం తర్వాత ఆయిల్‌ కంపెనీలు డాలర్లను ఆర్‌బీఐకి అప్పగించాల్సి ఉంటుంది. దీనివల్ల రూపాయి అస్థిరత తగ్గుతుంది. అలాగే ఫారెక్స్‌ నిల్వలపై ఎలాంటి ప్రభావం పడదు. 

ఎన్‌ఆర్‌ఐలను ఆకర్షించడం:
ప్రత్యేకమైన స్కీమ్స్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐల నుంచి డాలర్ల రూపంలో నిధులను సమీకరించొచ్చు. ఆర్‌బీఐ 2013లో తీసుకువచ్చిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌బి (ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ బ్యాంక్‌ అకౌంట్‌) స్కీమ్‌ను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్‌ సాయంతో దాదాపు 34 బిలియన్‌ డాలర్లను సమీకరించింది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌బి అనేది టర్మ్‌ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. వీటి కాల పరిమితి 1-5 ఏళ్లు ఉంటుంది. సేవింగ్స్‌ అకౌంట్‌ కాదు. వీటి ద్వారా ఎన్‌ఆర్‌ఐలు మన బ్యాంకుల్లో డాలర్లను డిపాజిట్‌ చేస్తారు. బ్యాంకులు డిపాజిట్లకు వార్షికంగా కొంత వడ్డీని అందిస్తాయి. 

క్యాడ్‌ తగ్గించుకోవడం:
2014-18 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో మన దిగుమతి బిల్లులో ఎలక్ట్రానిక్స్‌, మినరల్స్‌, మెషినరీ, మెటల్స్‌, జువెలరీ వంటి విభాగాల వాటా బాగా పెరుగుతూ వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఇందులో కొంత తగ్గుదల కనిపించింది. ఉదాహరణకు 2015 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి టారిఫ్‌లను పది గ్రాములకు 375 డాలర్ల నుంచి 388 డాలర్లకు పెంచింది. దీంతో బంగారం దిగుమతులు తగ్గాయి. మార్చిలో క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌పై 33 శాతం నుంచి 48.4 శాతానికి టారిఫ్‌లను పెంచింది. సాఫ్ట్‌ ఆయిల్స్‌పై టారిఫ్‌లను పెంచుకుంటూ వెళ్లింది. ఇలాంటి చర్యలు ఫలితమివ్వడానికి కొంత సమయం పడుతుంది. అలాగే మేకిన్‌ ఇండియా వల్ల ఎగుమతులను పెంచుకోవడం వల్ల సానుకూల ప్రభావం పడుతుంది. You may be interested

పెట్రోరంగ షేర్ల ర్యాలీ

Friday 14th September 2018

ముంబై:- పెట్రోరంగ షేర్లు గురువారం పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గరిష్ట ధరల నుంచి తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయంగా రూపాయి బలపడటం ఇందుకు కారణమయ్యాయి. బీఎస్‌ఎస్‌ఈలో పెట్రోఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎస్‌&పీ బీఎస్‌ఈ ఆయిల్‌ & ఇండెక్స్‌ గ్యాస్‌ 2శాతం వరుకు లాభపడింది. ఈ సూచీలు ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీలు 4నుంచి పెద్ద ర్యాలీ చేశాయి. ఇదే సమయానికి

స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 14th September 2018

డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా మార్కెట్లో నేడుయ ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 11 గంటలకు ఔన్స్‌ పసిడి 2 డాలర్లు లాభపడి రూ.1,211 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా వెల్లడించే ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దీంతో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ట్రంప్‌ ‘‘అమెరికాతో చైనాకు ఎదురైన

Most from this category