STOCKS

News


రెండేళ్లు వేచిచూడగలరా!

Friday 19th October 2018
Markets_main1539941834.png-21292

నాలుగు సిఫార్సులు చేస్తున్న ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌
దీర్ఘకాలిక దృక్పధంతో కనీసం రెండేళ్లు వేచిచూసే ఓపిక ఉన్న ఇన్వెస్టర్ల కోసం ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ నాలుగు మేలైన షేర్లను సిఫార్సు చేస్తోంది..
1. అశోక్‌ లేలాండ్‌: ఇటీవల కాలంలో నెగిటివ్‌ వార్తలతో షేరు భారీ పతనాన్ని చూసింది. ప్రస్తుత స్థాయిల వద్ద ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 2020 నుంచి బీఎస్‌6 ప్రమాణాల అమలు కంపెనీకి కలిసిరానుంది. అధిక టన్నేజ్‌ ట్రక్కులకు డిమాండ్‌ పెరగడం, కంపెనీకి డిఫెన్స్‌ రంగ ఆర్డర్లు మరింత జోరందుకోవడం మేలు చేసే అంశాలు.
2. గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌: దేశీయంగా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ ఊపందుకుంది. ఇదే సమయంలో ఇతర దేశాల్లో ప్లాంట్లు వివిధ కారణాలతో మూతపడడం కంపెనీకి కలిసివచ్చే అంశం. బలమైన బాలెన్స్‌షీటు కంపెనీ సొంతం. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, క్లోరో మిథేన్స్‌ ఉత్పత్తి క్రమంగా పెంచే చర్యలు తీసుకుంటోంది.
3. కొకుయో కామ్లిన్‌: ఇటీవలే సామర్ధ్యాన్ని 40 శాతం మేర పెంచుకుంది. మేనేజ్‌మెంట్‌లో సైతం కీలకమార్పులు వచ్చాయి. కంపెనీ మాతృసంస్థ తన వైవిధ్య భరిత ఉత్పత్తులను ఇండియాలో ప్రవేశపెట్టనుంది. జీఎస్‌టీలో సంఘటితరంగంలోని ఈ తరహా కంపెనీలకు అత్యంత ప్రయోజనాలు చేకూరనున్నాయి.
4. సెలాన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌: చమురు క్షేత్రాలన్నింటిలో ఉత్పత్తి పెంపుదల చర్యలు చేపట్టింది. చమురు ధరల పెరుగుదల, రుణభారం లేకపోవడం, బలమైన బాలెన్స్‌ షీట్‌... కంపెనీకి కలిసివచ్చే అంశాలు. You may be interested

ఈ పతనం చాలదు!

Friday 19th October 2018

దేశీ సూచీలపై సీఎల్‌ఎస్‌ఏ కొద్దికాలంగా భారత సూచీల్లో కొనసాగుతున్న కరెక‌్షన్‌ సరిపోదని, మార్కెట్లు మరికొంత పతనం చూడాల్సిఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. నిఫ్టీ గత ఒకటిరెండు నెలల్లో 11170 పాయింట్ల నుంచి 10170 పాయింట్ల వరకు పతనమైన సంగతి తెలిసిందే. శుక్రవారం సైతం సూచీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ మరోమారు 150 పాయింట్ల నష్టంతో 10300 పాయింట్లకు చేరింది. ఈ డౌన్‌ ట్రెండ్‌ ఇప్పుడు ఆగదని సీఎల్‌ఎస్‌ఏ భారత్‌

ఐటీ, ఫార్మాలు మెరుగు...టెలికాం, ఎన్‌బీఎఫ్‌సీలతో జాగ్రత్త

Friday 19th October 2018

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎక్కువగా ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగ స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ రంగాలకు చెందిన కంపెనీలు మంచి ఎర్నింగ్స్‌ను ప్రకటించొచ్చని, వీటి ప్రాఫిట్‌ మార్జిన్లు మెరుగుపడొచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలికం, మెటల్స్‌, మైనింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్‌స్ట్రక‌్షన్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలకు చెందిన స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శరవణ కుమార్‌ హెచ్చరించారు. చాలా ప్రతికూలతలు ఉన్నప్పటికీ

Most from this category