STOCKS

News


షార్ట్‌టర్మ్‌కు టాప్‌టెన్‌ ఐడియాలు

Monday 21st January 2019
Markets_main1548059901.png-23702

వచ్చే 2- 3 వారాల్లో మంచి రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి.
చార్ట్‌వ్యూ ఇండియా సిఫార్సులు:
1. డాబర్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 439. స్టాప్‌లాస్‌ రూ. 416. ఇటీవల పతనం పూర్తయి బాటమ్‌అవుట్‌ చెందినట్లు కనిపిస్తోంది. రూ. 417 స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. గత రెండు సెషన్లలో బుల్స్‌ పైచేయి సాధించాయి. రూ. 420కిపైన స్థిరంగా ముగిస్తే మరింత ముందుకు దూసుకుపోతుంది.
2. హీరోమోటోకార్‌‍్ప: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3118. స్టాప్‌లాస్‌ రూ. 2855. గత ర్యాలీకి 80 శాతం రిట్రేస్‌మెంట్‌ పతనం పూర్తి చేసుకొని రూ. 2850 వద్ద బేస్‌ ఏర్పరుచుకుంటోంది. ఇక్కడ బాటమ్‌ అవుటయితే మరోదఫా రూ.3380 వరకు ఎగబాకేందుకు అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం రిస్కు రివార్డు నిష్పత్తి కూడా బాగుంది. 
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు:
1. హెచ్‌సీఎల్‌ టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1060. స్టాప్‌లాస్‌ రూ. 918. చార్టుల్లో డోజి క్యాండిల్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. ఇది బుల్లిష్‌ రివర్సల్‌ సంకేతం. అంతేకాకుండా హయ్యర్‌టాప్స్‌ అండ్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. షేరు ధర 21 రోజలు డీఎంఏ స్థాయికి పైన క్లోజయింది. త్వరలో మరింత అప్‌మూవ్‌ ఉంటుంది.
2. గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1050. స్టాప్‌లాస్‌ రూ.890. మూడు అలల క్షీణతను రూ. 1663 నుంచి రూ. 640 మధ్యలో పూర్తి చేసుకొంది. ఇకమీదట కొత్త తరంగాన్ని అప్‌సైడ్‌ ఏర్పరిచేందుకు రెడీగా ఉంది. ఇందుకు తగ్గట్లు ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి. స్టాకు ధర కీలక ఈఎంఏ స్థాయిలకు పైన కదలాడుతోంది.
ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు:
1. కోటక్‌ మహీంద్రా బ్యాంకు: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1380. స్టాప్‌లాస్‌ రూ. 1190. డైలీ చార్టుల్లో హయ్యర్‌ బాటమ్‌ ఏర్పరిచింది. రూ. 1200 వద్ద మంచి మద్దతు పొందుతోంది. ఇక్కడే 50 రోజుల ఈఎంఏ స్థాయి ఉంది. ఇక్కడనుంచి పాజిటివ్‌ టర్న్‌ తీసుకుంటోంది. ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. 
2. హెచ్‌డీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2170. స్టాప్‌లాస్‌ రూ. 1950. చాలా రోజులుగా కన్సాలిడేట్‌ అవుతోంది. బ్రేకవుట్‌కు సిద్ధంగా ఉంది. చార్టులు బలంగా కనిపిస్తున్నాయి. వాల్యూంలతో కూడిన కొనుగోళ్లు నమోదవుతున్నాయి.
యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు:
1. కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 340. స్టాప్‌లాస్‌ రూ. 274. వీక్లీ చార్టుల్లో దీర్ఘకాలిక నిరోధాన్ని చేరుతోంది. రూ. 300ను విజయవంతంగా దాటితే మరింత అప్‌మూవ్‌ ఉంటుంది. ఇటీవలే వాల్యూంలతో కూడిన కొనుగోళ్లు నమోదయ్యాయి. 
2. విప్రో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 380. స్టాప్‌లాస్‌ రూ. 330. తాజాగా ఊర్ధ్వముఖ త్రిభుజాకృతి పైఅవధిని మంచి వాల్యూంలతో దాటింది. రాబోయే అప్‌ట్రెండ్‌కు ఇది సంకేతం. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయి.
ఏంజల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు:
1. బ్రిటానియా ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3460. స్టాప్‌లాస్‌ రూ. 3060. చాలా సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన చూపుతోంది. ఇటీవల మంచి కన్సాలిడేషన్‌ చూసింది. రూ. 3180కి పైన మరింత అప్‌మూవ్‌ ఛాన్సులుంటాయి.
ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సిఫార్సులు
1. ఇంద్రప్రస్ధ గ్యాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 305. స్టాప్‌లాస్‌ రూ. 260. స్వల్ప, దీర్ఘకాలిక డీఎంఏలకు పైన ట్రేడవుతోంది. వీక్లీచార్టుల్లో కంటిన్యూషన్‌ ట్రయాంగిల్‌ పాటర్న్‌ నుంచి పాజటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. అందువల్ల రాబోయే రోజుల్లో మరింత ముందుకు కొనసాగుతుంది. You may be interested

రెండో రోజూ రిలయన్స్‌ ర్యాలీ

Monday 21st January 2019

మూడున్నర గరిష్టం వద్ద షేరు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు వరుసగా రెండో రోజూ ర్యాలీని కొనసాగిస్తుంది. కంపెనీ క్యూ3లో అంచనాలకు మించిన లాభాలను ఆర్జించడం ఇందుకు నేపథ్యం. గతవారంలో గురువారం విడుదుల చేసిన గణాంకాల ప్రకారం పెట్రో, రిటైల్‌, టెలికాం విభాగాల్లో కంపెనీ రాణించడంతో మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.10251 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఒక త్రైమాసికంలో రూ.10వేల కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్‌ కంపెనీగా రిలయన్స్‌

విప్రో షేరును ఏం చేద్దాం?

Monday 21st January 2019

క్యు3లో విప్రో ప్రకటించిన ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని బ్రోకింగ్‌సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. మార్జిన్లు పాజిటివ్‌గా ఉండడం అనూహ్యమని అభిప్రాయపడ్డాయి. అయితే ఇప్పటికిప్పుడు షేరు రేటింగ్‌ను పెంచలేదు. కానీ, కొన్ని సంస్థలుటార్గెట్‌ను పెంచాయి. షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి. 1. సిటి: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 325కు పెంపుదల. ఫలితాల్లో మార్జిన్లు బాగున్నాయి. రెవెన్యూ అంచనాలకు అనుగుణంగా లేదు. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం భవిష్యత్‌ వృద్ధికి కీలకంగా మారింది. 2. జెఫర్రీస్‌: అండర్‌పెర్ఫామ్‌. టార్గెట్‌

Most from this category