STOCKS

News


రూ.750 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు హెచ్‌ఈజీ బోర్డు ఆమోదం

Tuesday 27th November 2018
Markets_main1543299525.png-22413

న్యూఢిల్లీ: గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌లు తయారు చేసే హెచ్‌ఈజీ కంపెనీ రూ.750 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. సోమవారం జరిగిన  డైరెక్టర్ల బోర్డ్‌ ఈ షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపిందని హెచ్‌ఈజీ వెల్లడించింది. మరోవైపు ఉత్పత్తి పెంపునకు సంబంధించిన రూ.1,200 కోట్ల మూలధన పెట్టుబడుల ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించింది. ఈ​ప్రతిపాదనలో భాగంగా  ప్రస్తుతం 80,000 టన్నులుగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 20,000 టన్నులు పెంచనున్నామని వివరించింది. చెల్లించిన మూలధనంలో 3.41 శాతం వాటాకు సమానమైన 13,63,636 షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు హెచ్‌ఈజీ తెలియజేసింది. ఒక్కో షేర్‌ బైబ్యాక్‌ ధర రూ.5,500గా ఉండనుంది.



You may be interested

ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి కోసం పసిడి ఎదురుచూపులు

Tuesday 27th November 2018

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి కోసం పసిడి చూస్తోంది. ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.11:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర అరడాలర్‌ నష్టపోయి 1,222 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గురువారం ఫెడ్‌ పాలసీ మినిట్స్‌ విడుదల సందర్భంగా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగంలో కీలక వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ

నకిలీ ఉత్పత్తులకు స్నాప్‌డీల్‌ చెక్‌...

Tuesday 27th November 2018

'బ్రాండ్‌ షీల్డ్‌' విధానం అమలు న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్‌ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ తాజాగా 'బ్రాండ్ షీల్డ్' పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్‌ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్‌డీల్‌లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌, పేటెంట్‌, డిజైన్‌పరంగా జరిగే

Most from this category