STOCKS

News


ఐటీ ఎర్నింగ్స్‌.. ఎలా ఉండొచ్చు?

Friday 12th October 2018
Markets_main1539328854.png-21086

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ, జూలై-సెప్టెంబర్‌) ఐటీ కంపెనీల ఎర్నింగ్స్‌ ఎలా ఉండొచ్చొ తెలియజేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం..

♦ ఐటీ కంపెనీల ఎర్నింగ్స్‌లో మంచి వృద్ధి నమోదు కావొచ్చు. రెవెన్యూ వృద్ధి వార్షికంగా 7.9 శాతం, త్రైమాసికంగా 2.1 శాతంగా ఉండొచ్చు. టైర్‌-1 ఐటీ వృద్ధి 1.9 శాతం (క్వార్టర్ పరంగా), 6.7 శాతం (వార్షికంగా).. మిడ్‌క్యాప్‌ ఐటీలో వృద్ధి 3.4 శాతంగా (క్వార్టర్‌ పరంగా), 15.6 శాతం (వార్షికంగా) ఉండొచ్చు. ఇన్ఫోసిస్‌ ఎర్నింగ్స్‌లో మంచి వృద్ధి నమోదు కావొచ్చు. మిడ్‌క్యాప్స్‌లో ఎల్‌టీటీఎస్‌, జెన్‌సర్‌, సైయంట్‌, సొనాటా కంపెనీలు వృద్ధిలో ముందుంటాయి. 

♦ నిర్వహణ పనితీరు మెరుగుపడుతుందని అంచనా. రూపాయి క్షీణత, ఆటోమేషన్‌ వంటి అంశాలు ఇందుకు కారణం. మిడ్‌క్యాప్స్‌లో మైండ్‌ట్రీ, జెన్‌సర్‌, సొనాటా కంపెనీల మార్జిన్లలో మంచి వృద్ధి కనిపించే అవకాశముంది. లార్జ్‌క్యాప్స్‌లో టీసీఎస్‌ ఫలితాలను ఇప్పటికే చూశాం. 

♦ టైర్‌-1 ఐటీలో టీసీఎస్‌.. టైర్‌-2 ఐటీలో ఎల్‌టీఐ, ఎల్‌టీటీఎస్‌, జెన్‌సర్‌, సైయంట్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. మెజెస్కో, కేపీఐటీ స్టాక్స్‌కు కూడా ప్రాధాన్యమివ్వొచ్చు.

♦ బీఎఫ్‌ఎస్‌ఐ అండ్‌ రిటైల్‌ ఔట్‌లుక్‌, డిమాండ్‌, డీల్స్‌, డిజిటల్‌ విభాగంలో పనితీరు, నిర్వహణ పనితీరు వంటి అంశాలను గమనించాల్సి ఉంది. 

కంపెనీ            క్యూ2 ఎర్నిం‍గ్స్‌ అంచనాలు
ఇన్ఫోసిస్‌            బాగుంటాయి 
విప్రో            యావరేజ్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌        యావరేజ్‌
టెక్‌ మహీంద్రా        యావరేజ్‌
ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌    బాగుంటాయి
ఎంఫసిస్‌            యావరేజ్‌
మైండ్‌ట్రీ            బాగుంటాయి
హెక్జావేర్‌ టెక్‌        యావరేజ్‌
ఎల్‌అండ్‌టీ టెక్‌        బాగుంటాయి
సైయంట్‌            బాగుంటాయి
పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌    బాగుండవు
జెన్‌సర్‌ టెక్‌        బాగుంటాయి
కేపీఐటీ టెక్‌        యావరేజ్‌
ఇ-క్లర్క్స్‌ సర్వీసెస్‌        యావరేజ్‌
సొనాటా సాఫ్ట్‌వేర్‌        బాగుంటాయి
ఇన్‌టెలెక్ట్‌    డిజైన్‌        బాగుంటాయి
మెజెస్కో            బాగుంటాయి
    You may be interested

సందడి చేస్తున్న అటో షేర్లు

Friday 12th October 2018

6శాతం లాభపడిన మహీంద్రా&మహీంద్రా ముంబై:- మార్కెట్‌ ర్యాలీ భాగంగా శుక్రవారం అటో షేర్లు సందడి చేస్తున్నాయి. అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 4.50శాతం లాభపడింది. మహీంద్రా&మహీంద్రా, మారుతి కంపెనీ షేర్ల 6శాతం ర్యాలీ ఇండెక్స్‌ను ముందుండి నడిపించింది. మధ్యాహ్నం గం.12:25ని.లకు అటో ఇండెక్స్‌ గత ముగింపు (8739.50)తో పోలిస్తే 4.19శాతం లాభంతో 9,106.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం

టీసీఎస్‌ షేరును ఏం చేద్దాం?

Friday 12th October 2018

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ క్యు2 ఫలితాలు ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగానే ఫలితాలున్నా షేరు మాత్రం శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం నష్టంలో ట్రేడవుతోంది. ఈ నెల్లో టీసీఎస్‌ షేరు దాదాపు 15 శాతం మేర క్షీణించింది. ఫలితాలు బాగున్నా షేరులో పాజిటివ్‌ కదలికలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ ఫలితాలు, షేరుపై ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు ఎలాంటి సలహా ఇస్తున్నాయో చూద్దాం... పాజిటివ్‌ అంచనాలు ఇచ్చిన సంస్థలు - సీఎల్‌ఎస్‌ఏ:

Most from this category