News


హెచ్‌డీఎఫ్‌సీ లాభం 27 శాతం అప్‌

Monday 13th May 2019
Markets_main1557732623.png-25707

మార్చి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 27 శాతం పెరిగి రూ. 2861.6 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 2256.68 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ రూ. 11586 కోట్లను చేరింది. కంపెనీ కొత్త అకౌంటింగ్‌ ప్రమాణాలకు మారినందున ఈ ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేము. కంపెనీ స్థూల ఎన్‌పీఏలు 1.22 శాతం నుంచి 1.18 శాతానికి దిగివచ్చాయి. క్యు4లో కంపెనీ ఎన్‌ఐఐ 6 శాతం పెరిగి రూ. 3183. 3 కోట్లకు చేరింది. లోన్‌గ్రోత్‌ 13.8 శాతం వృద్ధి సాధించింది. నికర వడ్డీ మార్జిన్లు మాత్రం 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గాయి. ఒక్కో షేరుపై కంపెనీ రూ. 17.50 అంతిమ డివిడెండ్‌ను ప్రకటించింది. మధ్యాహ్న సమయానికి కంపెనీ షేరు 1.5 శాతం లాభంతో 1961 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.50శాతం డౌన్‌

Monday 13th May 2019

స్వల్ప నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 3.50 శాతం నష్టపోయింది. ఇప్పటివరకు క్యూ4 ఫలితాలను ప్రకటించిన పలు ప్రభుత్వరంగ బ్యాంకుల ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ రంగ షేర్లలో అమ్మకాలు మొదలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలహాదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా 7శాతం నష్టపోయింది. యూనియన్‌ బ్యాంక్‌, కెనరా

ఐటీసీ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Monday 13th May 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ సోమవారం ఫలితాలు ప్రకటించనుంది. ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. - ఐసీఐసీఐ డైరెక్ట్‌: నికర లాభం పదిశాతం పెరిగి రూ. 3226.5 కోట్లకు చేరవచ్చు. నికర విక్రయాల్లో 8.3 శాతం వృద్ధి ఉండొచ్చు. ఎబిటాలో 9.9 శాతం మెరుగుదల అంచనా.  - కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: స్టాండలోన్‌ లాభం 7.8 శాతం పెరిగి రూ. 3160.4 కోట్లకు చేరవచ్చు. నికర విక్రయాల్లో 7.4 శాతం, ఎబిటాలో

Most from this category