STOCKS

News


మెప్పించని ఫలితాలు: హెచ్‌డీఎఫ్‌సీ 2.5 శాతం డౌన్‌

Tuesday 29th January 2019
Markets_main1548755204.png-23876

గృహ రుణాలను అందించే హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) మంగళవారం మధ్యాహ్న వెల్లడించిన ఫలితాలు మార్కెట్‌ను ఆకట్టుకోలేకపోయాయి. ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో రూ. 2114 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది గతేడాదితోనూ, కూ2తోనూ పోలిస్తే తక్కువ. ఇదే ఆర్థిక సంవత్సరం క్యూ2లో నికరలాభం రూ.2,467 కోట్లుగా నమోదైంది. 2017 డిసెంబర్‌ క్వార్టర్లో నికరలాభం రూ. 5300 కోట్లు. అయితే ఆ రెండు క్వార్టర్లలోనూ హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లు పబ్లిక్‌ ఇష్యూల జారీ ద్వారా వచ్చిన ఆదాయం ఆయా లాభాల్లో కలిసి వున్నందున, తాజా క్వార్టర్‌ లాభాన్ని వాటితో పోల్చవీలులేదు. మొత్తానికి మార్కెట్‌ అంచనాలకంటే ఈ క్వార్టర్లో మెరుగైన నికరలాభాన్నే కనపర్చింది.  ఈ క్యూ3లో నిర్వహణ ఆదాయం రూ.10,450కోట్లను ఆర్జించింది. నిర్వహణ ఆదాయం  త్రైమాసిక ప్రాతిపదికన 3శాతం పెరగ్గా, వార్షిక ప్రాతిపాదికన 20శాతం వృద్ధిని సాధించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ. 3,192 కోట్లకు ఎగిసింది. అంతకుముందు ఏడాదిలో ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన రూ.2,737 కోట్లతో పోలిస్తే ఇది 17శాతం అధికం. నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతం నమోదు కాగా, ఇదే క్వార్టర్‌లో ప్రొవిజన్స్‌ రూ.116కోట్లుగా నమోదయ్యాయి. ఈ క్యూ2లో పన్ను వ్యయాలు రూ.1022 కోట్లు నమోదవ్వగా, ఈ క్యూ3 నాటికి రూ.755 కోట్లకు దిగివచ్చాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.15 శాతం నుంచి 1.22 శాతానికి పెరిగాయి.
2.50శాతం క్షీణించిన షేరు:-
ఫలితాల్లో ఆశ్చర్చపర్చే అంశాలేవీ లేకపోవడంతో  షేరు ఇంట్రాడేలో ఏకంగా 2.50శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో రూ.1949.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో షేరు ఇంట్రాడేలో ఏకంగా 2.65శాతం క్షీణించి రూ.1896.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:10ని.లకు షేరు గతముగింపు(రూ.1948.06) ధరతో పోలిస్తే 1.70శాతం క్షీణించి రూ.1917ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1646.00లు, రూ.2051ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

స్వల్ప నష్టాలతో ముగింపు

Tuesday 29th January 2019

చివరి గంట కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీ నష్టాల నుంచి గట్టెక్కింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ షేర్ల  రికవరీతో సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 64 పాయింట్లను కోల్పోయి 35,592 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 10650 పాయింట్లపైన, 10,652 వద్ద ముగిసింది. ప్రైవేట్‌ రంగ షేర్లైన హెచ్‌డీఎఎఫ్‌సీ బ్యాంక్, యస్‌బ్యాంక్‌ కోటక్‌ బ్యాంక్‌ 1శాతం పతనం కారణంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ

పదేళ్లలో పది రెట్లు..యాంబిట్‌ క్యాపిటల్‌ బెట్స్‌

Tuesday 29th January 2019

వచ్చే పదేళ్లలో ఇన్వెస్టర్ల సంపదని 10 రెట్లు పెంచగలిగే 30 షేర్లను పరిశోధించి...బ్రోకింగ్‌ సంస్థ యాంబిట్‌ క్యాపిటల్‌ మంగళవారం జాబితాను విడుదల చేసింది. నీల్‌కమల్, లాఒపెలా, ఎవిన్యూ సూపర్‌మార్ట్, మారుతి సుజుకి, కన్సాయి నెరోలాక్, పీవీఆర్, వెంకీస్‌ ఇండియా, సుదర్శన్‌ కెమికల్స్, టొరెంట్‌ పవర్, షీలాఫోమ్, గోద్రేజ్‌ ఆగ్రోవెట్, జేబీ కెమికల్స్, వాబ్కో ఇండియా, హెడిల్‌బర్గ్‌ సిమెంట్, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్, అడ్వాన్స్‌ ఎంజైమ్స్, జాన్‌సన్‌ కంట్రోల్, సీసీఎల్‌ ప్రాడక్ట్స్,

Most from this category