STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీఓకు సెబీ ఓకే..!

Saturday 14th July 2018
Markets_main1531554364.png-18316

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 3,000-3,500 కోట్ల సమీకరణకు సిద్ధమైంది. ప్రైస్‌బ్యాండ్‌ రూ.1,200-1,500ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఐపీఓలో భాగంగా 2.54 కోట్ల షేర్లను జారీ చేయనుంది. వీటిలో 3.20 లక్షల షేర్లను సంస్థ ఉద్యోగులకు, 24 లక్షల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ హోల్డర్లకు కేటాయించారు. మిగతా మొత్తం షేర్లను అంటే 2.21 కోట్ల షేర్లను మాత్రమే ఆఫర్‌ ఉంచనున్నారు. ఈ జూలై చివరి వారంలో ఈ ఐపీఓ ఇష్యూ ఉండొచ్చు. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా నొముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా), కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, బోఫా మెరిల్‌ లించ్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియాలు వ్యవహరిస్తున్నాయి.

 



You may be interested

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ తిరస్కరణకు గురైతే??

Saturday 14th July 2018

ఒక ప్రాంతాన్ని చూడటానికి టూర్‌ వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు. అందుకే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ట్రావెల్‌ చేసేటప్పుడు ట్రిప్‌ రద్దవ్వడం, బ్యాగేజ్‌ తస్కరణ, ఊహించని ప్రమాదాలు, విదేశాల్లో పాస్‌పోర్ట్‌ కనిపించకుండా పోవడం, మెడికల్‌ ఎమర్జెన్సీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్‌ పాలసీ మనకు భరోసానిస్తుంది. అయితే కొన్నిసార్లు  దురదృష్టవశాత్తు పాలసీ ఉన్నా కూడా ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ రిజెక్ట్‌ అవ్వొచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఇలా అవ్వచ్చొ ఒకసారి చూద్దాం.. మద్యంతో

లగ్జరీ కార్లు రయ్‌.. రయ్‌..

Saturday 14th July 2018

జనవరి-జూన్‌లో 20,000 యూనిట్ల విక్రయాలు లగ్జరీ కార్ల విక్రయాలు జోరుమీదున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 20,000 యూనిట్లుగా నమోదయ్యాయి. సగటున 12-13 శాతం వృద్ధి రేటు కనిపించింది. 2017లో మొత్తం అమ్మకాలు 39,000గా ఉన్నాయి. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, డీలర్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, కస్టమర్ల డిమాండ్‌ వంటి పలు అంశాలు విక్రయాల పెరుగుదలకు కారణం. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు జనవరి నుంచి రెండంకెల వృద్ధిని నమోదుచేస్తూ వస్తున్నాయి. మెర్సిడెస్‌

Most from this category