STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బాండ్ల జారీ..!

Friday 16th November 2018
Markets_main1542365061.png-22104

ముంబై: ప్రైవేటు రంగ ఫైనాన్స్‌ దిగ్గజమైన హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) త్వరలోనే బాండ్లను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుబాటు గృహ రుణ మంజూరీ పెంచడం కోసం వచ్చే ఏడాది జనవరిలో సంస్థ డాలర్‌ బాండ్ల జారీ ద్వారా ఒక బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,185 కోట్లు)ను సమీకరించనుందని అనధికారికంగా వెల్లడైంది. ప్రస్తుతం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిధుల కొరతతో అల్లాడుతుండగా.. ఈ సమస్యను అధిగమించడంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బాండ్ల జారీ మార్గాన్ని ఎంచుకోనుందని తెలుస్తోంది. తద్వారా సంక్షోభంలో ఉన్న మార్కెట్‌ నుంచి వాటాను పెంచుకునే దిశగా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఈ సంస్థ మాత్రం క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలనే ప్రకటించింది. నిర్వహణలో ఉన్నటువంటి ఆస్తులు ఏడాది ప్రాతిపదికన 17 శాతం వృద్ధి చెంది రూ.4.30 లక్షల కోట్లుగా సంస్థ తెలిపింది. ఆస్తులు, అప్పులు సైతం సమంజసంగా ఉన్నట్లు తెలిపింది. ఇక సంస్థ సగటు రుణ పరిమాణం రూ.20.7 లక్షలు కాగా, సగటు కాలవ్యవధి 13 ఏళ్లుగా ఉంది. గడిచిన క్యూ2లో నికర లాభం 25 శాతం వృద్ధి చెంది రూ.2,467 కోట్లుగా తెలిపింది. 



You may be interested

వీటిల్లో ఎఫ్‌ఐఐలు, ఫండ్స్‌ వాటాలు పెరుగుతున్నాయ్‌

Saturday 17th November 2018

స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన వేల కంపెనీల్లో రాబడులకు అవకాశం ఉన్న మంచి షేర్ల కోసం రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారు. కొన్ని గణాంకాల ఆధారంగా పెట్టుబడులకు అనువైన షేర్లను సులభంగానే గుర్తు పట్టొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు క్రమంగా ఓ కంపెనీలో పెట్టుబడులు పెంచుకుంటున్నారంటే... ఆ కంపెనీ వృద్ధి అవకాశాలపై వారు ఎంతో ఆశావహంగా ఉన్నట్టే. గడిచిన మూడు త్రైమాసికాల కాలంలో ఎఫ్‌ఐఐలు, మ్యూచువల్‌

ఎర్నింగ్స్‌ రిస్క్‌ ఉంది...జాగ్రత్త

Friday 16th November 2018

కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పరంగా చూస్తే రిస్క్‌ ఇంకా మిగిలే ఉందని, రానున్న కాలంలో కంపెనీల లాభాల వృద్ధి తగ్గొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాన్ని తీసుకుంటే.. ఎర్నింగ్స్‌ పరంగా 2015 నుంచి అదే బలహీనమైన క్వార్టర్‌ అని తెలిపింది. దీనికి జీఎస్‌టీ అమలు కారణమని, దీని వల్ల దేశీ ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పెయింట్స్‌, ఇండస్ట్రీయల్స్‌ రంగాలపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక

Most from this category