STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌.. నెంబర్‌వన్‌!

Wednesday 22nd May 2019
Markets_main1558503083.png-25874

మార్కెట్‌క్యాప్‌ పరంగా అగ్రస్థానం కైవసం
మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా టాటా గ్రూప్‌ను తోసిరాజని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ అగ్రస్థానానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన ఐదు కంపెనీల- హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీఅండ్‌గృహ్‌ఫైనాన్స్‌ ఉమ్మడి మార్కెట్‌ వాల్యూ రూ. 11.66 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో టాటా గ్రూప్‌నకు చెందిన 29 కంపెనీల ఉమ్మడి మార్కెట్‌ వాల్యూ రూ.11.64 లక్షల కోట్ల రూపాయలుంది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ మార్కెట్‌క్యాప్‌ కన్నా టాటా గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2వేల కోట్లు వెనకబడింది. ఈ రెండు గ్రూప్‌ల మధ్య మార్కెట్‌ వాల్యూ పరంగా పోటీ ఇదే తొలిసారి కాదు. భారత్‌లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థానం కోసం హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌, టాటా గ్రూప్‌లు 2018 నుంచే పోటీ పడుతునే ఉన్నాయి. గతేడాది చివరకు వచ్చే సరికి ఒకరోజు ట్రేడింగ్‌ చివరకు టాటా గ్రూప్‌ వాల్యూషన్‌ పరంగా టాప్‌టో ఉంటే మరోరోజు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ ముందుంటోంది. గతేడాది డిసెంబర్‌లో టాప్‌ కార్పొరేట్‌ గ్రూప్‌గా ఉన్న టాటా గ్రూప్‌ను తోసిరాజని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ అగ్రస్ధానానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌లోని ఐదు కంపెనీల ఉమ్మడి విలువ డిసెంబర్‌లో 10. 40 లక్షల కోట్ల రూపాయలుండగా, టాటా గ్రూప్‌లోని 29 కంపెనీల ఉమ్మడి విలువ 10.38 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. తిరిగి అదేనెల్లో మరసటి రోజు క్లోజింగ్‌లో టాటా గ్రూప్‌ విలువ 10.45 లక్షల కోట్ల రూపాయలకు చేరగా, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ విలువ 10. 44 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. గతేడాది లిస్టయిన హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ విలువ పెంచాయి.టాటా గ్రూప్‌లో టీసీఎస్‌ లాభాలు చూపినా,  గ్రూప్‌లోని టాటా మోటర్స్‌ నేల చూపులు చూడడంతో గ్రూప్‌ విలువ భారీగా పెరగలేదు. టాటా గ్రూప్‌లో పలు కంపెనీలున్నప్పటికీ, వాటి మార్కెట్‌ క్యాప్‌ చాలా తక్కువ.



You may be interested

మెగా బ్యాంకుల సందడి!!

Wednesday 22nd May 2019

కనుమరుగు కానున్న ఆంధ్రా బ్యాంక్‌  పీఎన్‌బీలో విలీనం; మరో రెండు కూడా!! మూడు నెలల్లో ప్రక్రియ పూర్తికి ప్రయత్నాలు కెనరాలోనూ ఇతర బ్యాంకులను కలిపే యోచన న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎస్‌బీఐ, బీవోబీ తర్వా మరో రెండు మెగా బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దఫా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), కెనరా బ్యాంక్‌లలో ప్రభుత్వ రంగంలోని మరికొన్ని బ్యాంకులను విలీనం చేయడంపై కసరత్తు ఆరంభమయింది. పీఎన్‌బీలో రెండు లేదా మూడు

2వారాల కనిష్టం వద్ద పసిడి

Wednesday 22nd May 2019

డాలర్‌ ఇండెక్స్‌ 4వారాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి 2వారాల కనిష్ట ధర వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్పలాభంతో 1,273.65డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఇటీవల చైనా టెలికాం దిగ్గజ కంపెనీ హువాయిపై విధించిన సుంకాలను 3నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టింది. దీంతో

Most from this category