STOCKS

News


20 నెలల తర్వాత 200 డీఎంఏ దిగువకు

Wednesday 19th September 2018
Markets_main1537341318.png-20381

దిగజారిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు
బుధవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు వచ్చింది. గత 20 నెలల్లో బ్యాంకు షేరు బలమైన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్యాంకు షేరు దాదాపు ఒక శాతం నష్టంతో రూ. 1975 వద్ద కదలాడుతోంది. చార్టుల్లో ఎంఏసీడీ ఇండికేటర్‌ లైన్‌సైతం తన సిగ్నల్‌ లైన్‌కు దిగువన కదలాడుతోంది. దీన్ని బట్టి కౌంటర్లో మరికొంత బలహీనత కొనసాగవచ్చని అంచనా. సెప్టెంబర్‌లో మొత్తం మార్కెట్‌ మూడ్‌ నెగిటివ్‌గా ఉంది. ఈ నెల్లో ఎఫ్‌పీఐలు ఇండియా మార్కెట్‌పై దాదాపు శీతకన్ను వేశాయి. ఈ నెల్లో ఇంతవకు ఎఫ్‌ఐఐలు దాదాపు 3500 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిపాయి. ఎఫ్‌ఐఐలు జూలైలో 2200 కోట్ల రూపాయలు, ఆగస్టులో 1780 కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లు జరిపాయి. మొత్తం బ్యాంకింగ్‌ రంగం గత కొన్నాళ్లుగా బలహీనతను చూపుతోంది. 


 



You may be interested

మెటల్‌ షేర్ల హవా..!

Wednesday 19th September 2018

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం మిడ్‌ సెషన్‌ సమయానికి మెటల్‌ షేర్ల హవా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న మెటల్‌ షేర్ల ర్యాలీలో భాగంగా నేటి ఇంట్రాడేలో మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు రూపాయి పతనాన్ని నివారించే చర్చల్లో భాగంగా స్టీల్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం 5 శాతం నుంచి 12.5 శాతంగా ఉన్న  స్టీల్‌ ఉత్పత్తులపై

25న బ్యాంక్‌ చీఫ్‌లతో అరుణ్ జైట్లీ భేటీ..!

Wednesday 19th September 2018

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సెప్టెంబర్‌ 25వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశం కానున్నారు. వార్షిక ఫైనాన్షియల్‌ పరిస్థితులపై ఆయన ఈ సందర్భంగా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా  ఈ సమావేశంలో బ్యాంకింగ్‌ మొండిబకాయిలపై చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు- బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంకుల విలీన నిర్ణయమూ కీలక సమావేశానికి నేపథ్యం. రుణ వృద్ధి, బకాయిల రికవరీకి బ్యాంకింగ్‌ తీసుకుంటున్న

Most from this category