News


రూ.2174 ధరతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ-కొత్త గరిష్టస్థాయికి షేరు

Wednesday 18th July 2018
Markets_main1531890029.png-18418

ముంబై:- అధిక ధర వద్ద ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో తన మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీకు ఈక్విటీ షేర్ల జారీకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బోర్డు ఆమోదం తెలపడంతో ఆ బ్యాంక్‌ షేర్లు బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నూతన గరిష్టస్థాయిని నమోదు చేసాయి. నేడు బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు రూ.2181.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తన మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీకి ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ. 2,174.09ల వద్ద మెత్తం 3.90 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా రూ.8,500 కోట్ల సమీకరణకు తమ షేరు కేటాయింపు కమిటీ ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బుధవారం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈక్విటీ షేర్ల జారీ అంశం తెరపైకి రావడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.71శాతం లాభపడి రూ.2,214ల వద్ద ఆల్‌టైం హైని తాకాయి. ఉదయం గం.10:15ని.లకు షేరు గత ముగింపు ధర రూ.2176.7తో పోలిస్తే 1.50శాతం లాభపడి రూ.2208.05ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1675.85 రూ.2214.10లుగా నమోదయ్యాయి.



You may be interested

జ్యుయలర్లకు నీరవ్ మోదీ దెబ్బ

Wednesday 18th July 2018

చెన్నై: నీరవ్ మోదీ కుంభకోణం .. ఇతర ఆభరణాల తయారీదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. స్కామ్ నేపథ్యంలో బ్యాంకులు రుణాలివ్వడానికి వెనుకాడుతుండటంతో జ్యుయలర్లు నిధులపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు. "వజ్రాభరణాల పరిశ్రమకు ప్రస్తుతం రూ. 15,000 కోట్ల మేర నిధులు అవసరం. కానీ రుణాలు లభించడం లేదు. కొన్నాళ్ల క్రితం ఒక ఆభరణాల సంస్థ మూతబడింది. ఇక నీరవ్ మోదీ ఉదంతం తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారింది"

ఐసీఐసీఐ లంబార్డ్‌  లాభం రూ.289 కోట్లు ​

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.289 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.214 కోట్లు నికర లాభం సాధించామని, దీంతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తెలిపింది. స్థూల ​‍ప్రీమియమ్‌ వసూళ్లు రూ.3,394 కోట్ల నుంచి 14 శాతం వృద్దితో రూ.3,856 కోట్లకు

Most from this category