STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్లో బ్లాక్‌డీల్‌

Wednesday 10th April 2019
Markets_main1554888217.png-25054

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయాయి. ఎక్స్ఛేంజీలలో బ్లాక్‌డీల్స్‌ ద్వారా భారీ పరిమాణంలో షేర్లు చేతులు మారడంతో షేరు పతనానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.2255.00ల ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ అండ్‌ కో.. ఈ కంపెనీ చెందిన సుమారు 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను బ్లాక్‌డీల్‌ పద్దతిలో విక్రయించిందనే వార్తలు వెలుగులోకి రావడంతో ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మకానికి మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 2శాతం నష్టపోయి రూ.2242.00ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. మధ్యాహ్నం గం.2:00ల షేరు గత ముగింపు ధర(రూ.2290)తో పోలిస్తే రూ.1.85శాతం క్షీణించి రూ.2247.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1884.40 రూ.2332.35లుగా ఉన్నాయి.
 



You may be interested

ఎన్నికల్లో ఎవరొచ్చినా ఒక నెల పతనం గ్యారెంటీ!

Wednesday 10th April 2019

సమీర్‌ అరోరా, హీలియోస్‌ క్యాపిటల్‌ మార్కెట్లకు, రాజకీయాలకు మధ్య మరికొంత కాలం సంబంధం కొనసాగుతుందని హీలియోస్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. ఎన్నికల అనంతరం ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా సూచీల్లో ఒక నెల పాటు కరెక‌్షన్‌ ఉండొచ్చని అంచనా వేశారు. ఎన్నికల ఫలితాల రోజు లేదా తర్వాత రెండు మూడు రోజులు సూచీలు అప్‌మూవ్‌ చూపినా తర్వాత మాత్రం నెల పాటు పతనం ఖాయమన్నారు. ఎందుకంటే తాజాగా ర్యాలీకి

6నెలల గరిష్టానికి టాటామోటర్స్‌

Wednesday 10th April 2019

జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ వ్యాపారంలో వృద్ధితో మాతృసంస్థ టాటామోటర్స్‌ మార్జిన్లు పెరగవచ్చనే అంచనాలతో కంపెనీ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 6నెలల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ. 206.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతివ్వడంతో షేరు 4.50శాతం ర్యాలీ చేసి రూ.212.40ల ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది అక్టోబర్‌ 10 తరువాత షేరు ధర ఈ స్థాయిని తిరిగి అందుకోవడం

Most from this category