STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ​‍పైస్‌బ్యాండ్‌ రూ.1,095 -1,100

Wednesday 18th July 2018
Markets_main1531889917.png-18416

న్యూఢిల్లీ:  హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 25 నుంచి ఆరంభమవుతోంది. దేశంలో రెండో అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఈ ఐపీఓ ద్వారా రూ.2,800 కోట్లు సమీకరిస్తుందని అంచనా. రూ.5 ముఖ విలువ గల షేర్లను జారీ చేసే ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.1,095- 1,100ను కంపెనీ నిర్ణయించింది. కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27న ఈ ఐపీఓ ముగుస్తుంది. వచ్చే నెల 6న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.
2.54 కోట్ల షేర్ల జారీ...
హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల జాయింట్‌ వెంచర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో హెచ్‌డీఎఫ్‌సీ 4.08 శాతం వాటాకు సమానమైన  85.92 లక్షల షేర్లను, స్డాండర్డ్‌ లైఫ్‌ సంస్థ 7.95 శాతం వాటాకు సమానమైన 1.68 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. మొత్తం 2.54 కోట్ల షేర్లను జారీ చేస్తారు. వీటిల్లో 2.21 కోట్ల షేర్లను మాత్రమే ప్రజలకు జారీ చేస్తారు. 3.20 లక్షల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఉద్యోగులకు, 24 లక్షల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు రిజర్వ్‌ చేస్తారు. 
ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా నొముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా), కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, బోఫా మెరిల్‌ లించ్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియాలు వ్యవహిరిస్తున్నాయి. 
లిస్టవుతున్న ఐదో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ కంపెనీ...
ఈ ఏడాది మార్చినాటికి హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ నిర్వహణ ఆస్తులు రూ.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అవుతున్న రెండో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఇది. గత ఏడాదే రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఏఎమ్‌సీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ నుంచి స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అవుతున్న  ఐదో కంపెనీ ఇది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ స్డాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గృహ్‌ ఫైనాన్స్‌లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. 
 



You may be interested

ఐసీఐసీఐ లంబార్డ్‌  లాభం రూ.289 కోట్లు ​

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.289 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.214 కోట్లు నికర లాభం సాధించామని, దీంతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తెలిపింది. స్థూల ​‍ప్రీమియమ్‌ వసూళ్లు రూ.3,394 కోట్ల నుంచి 14 శాతం వృద్దితో రూ.3,856 కోట్లకు

కేంద్రం ముందుకు ఎల్‌ఐసీ-ఐడీబీఐ డీల్‌

Wednesday 18th July 2018

ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి మెజారిటీ వాటాలను విక్రయించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాటాలను 51 శాతం దాకా పెంచుకునేందుకు ఎల్‌ఐసీ చేసిన ప్రతిపాదనను బోర్డు సమావేశంలో చర్చించినట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. "దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బోర్డు నిర్ణయం తీసుకుంది" అని

Most from this category