STOCKS

News


ఈ నెల 18 నుంచి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్ల బైబ్యాక్‌

Wednesday 12th September 2018
Markets_main1536729509.png-20185

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  ఈ  నెల 18 నుంచి షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. వచ్చే నెల 3న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.1,100కు కొనుగోలు చేస్తారు. మొత్తం 3.64 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.4,000 కోట్లని సంస్థ తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు గతనెలలోనే వాటాదారులు ఆమోదం తెలిపారు. నికర లాభంలో సగానికి పైగా వాటాదారులకు వెనక్కిచ్చే వ్యూహంలో భాగంగా ఈ కంపెనీ షేర్లను బైబ్యాక్‌ చేస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 0.5 శాతం నష్టంతో రూ.1,083 వద్ద ముగిసింది. 



You may be interested

ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 2.46% క్షీణత

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు (పీవీ సేల్స్‌) వరుసగా రెండవ నెలలోనూ తగ్గుదలను నమోదు చేసినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. హై బేస్‌ ఎఫెక్ట్‌, కేరళ వరదల ప్రభావం కారణంగా ఆగస్టులో 2.46 శాతం క్షీణత నమోదైనట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథూర్‌ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల కూడా అమ్మకాలపై స్వల్ప ప్రభావం చూపాయని వ్యాఖ్యానించారు. గత నెలలో పీవీ

పీఎఫ్‌సీ లాభం రూ.1,373 కోట్లు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: పవర్‌ ఫైనాన్స్‌ కంపెనీ (పీఎఫ్‌సీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,373 కోట్ల నికర లాభం (స్టాండ్‌ అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.1,122 కోట్లతో పోలిస్తే 22 శాతం వృద్ధి సాధించామని పీఎఫ్‌సీ తెలిపింది. గత క్యూ1లో రూ.6,729 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.7,028 కోట్లకు పెరిగింది. పన్ను వ్యయాలు రూ.313

Most from this category