STOCKS

News


బైబ్యాక్‌ ప్రణాళికతో హెచ్‌సీఎల్‌ హల్‌చల్‌..!

Tuesday 10th July 2018
Markets_main1531208526.png-18165

ముంబై:- షేర్ల బైబ్యాక్ అంశం తెరపైకి రావడంతో ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. జూలై 12న జరిగే కంపెనీ బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశంపై చర్చిస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ సోమవారం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. షేర్ల బైబ్యాక్ అంశం వెలుగులోకి రావడంతో నేటి మార్కెట్‌ ప్రారంభంలోనే హెచ్‌సీఎల్‌ షేర్లు 4శాతం లాభంతో రూ.1000.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మధ్యాహ్నం గం.12:15ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.961.25)తో పోలిస్తే 2.15శాతం లాభంతో రూ.982ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 825.10 రూ.1106.60లుగా నమోదయ్యాయి.
హెచ్‌సీఎల్‌ బై బ్యాక్‌పై విశ్లేషకుల అంచనాలు:-
ఏడాది తరువాతర హెచ్‌సీఎల్‌ బైబ్యాక్‌ ఆఫర్‌ రూపంలో ఇన్వెస్టర్ల నుంచి షేర్లను తిరిగికొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. హెచ్‌సీఎల్‌ ప్రకటించిన ఈ బైబ్యాక్ ఆఫర్‌పై ఇన్వెస్టర్లు భారీ అంచనాలతో వున్నారు. గత ఏడాది రూ.3500 కోట్ల బై బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించిన కంపెనీ ఈసారి కూడా అదే పరిమాణంలో ఆఫర్‌ ఇవ్వవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి బైబ్యాక్ ధర రూ.1,100గా ఉండవచ్చని, గత ఏడాది 17శాతం అధిక ప్రీమియంను ఆఫర్‌ చేసిన కంపెనీ ఈసారి 10-15 శాతం ప్రీమియంతో కొనుగోలు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ వద్ద మొత్తం రూ.36,800 కోట్లకు పైగా నగదు, తత్సమాన రిజర్వులు వున్నాయి.



You may be interested

24 శాతం పెరిగిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం

Tuesday 10th July 2018

ముంబై: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.1,036 కోట్ల నికర లాభం సాధించామని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆర్జించిన నికర లాభం రూ.837 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి చెప్పారు.

రూపాయి విలువ 72 స్థాయికి తగ్గొచ్చు..!

Tuesday 10th July 2018

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అడ్డుకున్నప్పటికీ.. ఇది కేవలం తాత్కాలిక చర్యగానే ఉండనుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. పలు భారత కంపెనీలు విదేశాల నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాల తిరిగి చెల్లింపులకు సమయం దగ్గర పడుతుండడం, మండుతున్న ముడిచమురు ధరల కారణంగా మారకం విలువ మరంత కనిష్టస్థాయిలకు పడిపోయే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. రూపాయి విలువను నిలబెట్టడంలో భాగంగా ఆర్బీఐ

Most from this category