STOCKS

News


గ్రాసీమ్‌ 9శాతం క్రాష్‌

Thursday 15th November 2018
Markets_main1542267069.png-22047

నష్టాల క్యూ2 గణాంకాల నమోదు కారణంగా ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు గ్రాసీమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు గురువారం 9శాతం క్రాష్‌ అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో తైమాసిక కాలంలో కంపెనీ నష్టాలను నమోదు చేయడం షేరు పతనానికి కారణమైంది. ఈ క్యూ2లో కన్సాలిడేషన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.1,300 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ ఆర్జించిన రూ.799 కోట్ల నికరలాభాన్ని ఆర్జించడం గమనార్హం. కంపెనీ నిర్వహణ ఆదాయం మాత్రం 23శాతం పెరిగి రూ.16795 కోట్లను ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ ఆర్జించిన రూ.13570 కోట్లను ఆర్జించింది. వోడాఫోన్‌-ఐడియా కంపెనీ విలీనంతో అదనంగా రూ. 2,003కోట్ల నష్టం వాటిల్లినట్లు, కంపెనీ ఫలితాలపై ఈ ప్రభావాన్ని చూపినట్లు కంపెనీ అధికారుల తెలిపారు. క్యూ2లో నష్టాలను నమోదు చేయడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా కంపెనీ షేరు బీఎస్‌ఈలో 9శాతం క్షీణించి రూ.800.30ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:20ని.లకు షేరు గతముగింపు ధర(రూ.876.35)తో పోలిస్తే 7శాతం నష్టంతో రూ.805ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.756.00 రూ. 1258.40లుగా నమోదయ్యాయి.

టార్గెట్‌ ధర తగ్గించిన డచ్‌ బ్యాంక్‌:-
విదేశీ రీసెర్చ్‌ హౌస్‌ డచ్‌ బ్యాంక్‌ గ్రాసీం షేరు టార్గెట్‌ ధరను సవరించింది. గతంలో షేరు ఇచ్చిన రూ.1450ల టార్గెట్‌ ధరను రూ.1250లకు తగ్గించింది. అయితే షేరు ‘‘కొనుగోలు’’ రేటింగ్‌ను మాత్రం యధావిధిగా ఉంచింది. ‘‘సంస్థ ప్రధాన వ్యాపారాలన్నీ బలంగా ఉన్నాయి. ప్రస్తుతం వీఎస్‌ఎఫ్‌ & కెమికల్స్‌ వ్యాపార మార్జిన్లు సైకిల్‌లో గరిష్టానికి చేరుకున్నాయి. రానున్న 3 ఏళ్లలో కంపెనీ ఇబిటా మీద 10శాతం సీఏజీఆర్‌ నమోదు చేస్తుంది. అయితే ఈక్విటీ కొరత కంపెనీ ప్రధాన ప్రతికూలంశం’’ అని రీసెర్చ్‌ సంస్థ అంటుంది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం ర్యాలీ

Thursday 15th November 2018

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ గురువారం మిడ్‌ సెషన్‌ సమయానికి 1శాతం లాభపడింది.  ఈ సూచీలోని యాక్సిస్‌ బ్యాంక్‌ (3 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(2 శాతం) షేర్లు ర్యాలీ సూచీని లాభాల బాట పట్టించింది. మధ్యాహ్నం గం.1:10ని.లకు సూచి గతముగింపు(25,930.15)తో పోలిస్తే దాదాపు శాతం (0.90శాతం) లాభపడి 26,170.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన  మొత్తం 11 షేర్లలో 9

క్రూడ్‌ తగ్గుదలతో జీడీపీ జోరు

Thursday 15th November 2018

ఇండియాపై పాజిటివ్‌గా ఉన్నానని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య పూరి తెలిపారు. టెక్నాలజీ వల్ల కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై (ఎన్‌బీఎఫ్‌సీ) కఠినమైన పర్యవేక్షణ అవసరమని, అసెట్‌ క్వాలిటీ తారతమ్యాలపై దృష్టి క్రేంద్రీకరించాల్సి ఉందని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సమస్య తగ్గుతోందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మన వద్ద పూర్తిగా అభివృద్ధి చెందిన

Most from this category