News


50 లక్షల షేర్లు విక్రయించిన గ్రాన్యూల్స్‌ ప్రమోటర్లు

Saturday 9th March 2019
Markets_main1552118052.png-24512

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం 6.79 శాతం పెరిగి రూ.110.85 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.114.30 వరకు వెళ్లింది. రూ.50 కోట్ల నిధులను సమకూర్చుకోవడానికి 0.20 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను బ్లాక్‌ డీల్‌లో పలువురు ఇన్వెస్టర్లకు కంపెనీ విక్రయించింది. దీంతోపాటు సుమారు రూ.50 కోట్ల విలువైన వ్యక్తిగత ఆస్తులను సైతం అమ్ముతోంది. సమీకరించిన నిధులను రూ.100 కోట్ల వరకు రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించనుంది. దీంతో ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్ల శాతం ప్రస్తుతమున్న 54 శాతం నుంచి 30 శాతానికి రానుంది. రెండేళ్లలో తనఖా లేని స్థితికి తీసుకు రానున్నట్టు కంపెనీ వెల్లడించింది.



You may be interested

రేటింగ్‌ ఏజెన్సీల పాత్ర కీలకం: ఆర్‌బీఐ గవర్నర్‌

Saturday 9th March 2019

ముంబై: ఫైనాన్షియల్‌ రంగ స్థిరత్వంలో... అవి సమర్థంగా పనిచేయడంలో రేటింగ్‌ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. భాగస్వాములతో సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల ఉన్నతోద్యోగులతో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశమై చర్చించారు. ‘‘ఫైనాన్షియల్‌ సెక్టార్‌ సమర్థవంతంగా, సుస్థిరంగా పనిచేయడంలో క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భాగస్వాముల సంప్రతింపుల్లో భాగంగా గురువారం క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల ఎండీ, సీఈవోలతో సమావేశమయ్యాను’’

అర్‌వింద్‌ ఫ్యాషన్స్‌ లిస్టింగ్‌

Saturday 9th March 2019

అర్‌వింద్‌ ఫ్యాషన్స్‌ లిస్టింగ్‌ 5 శాతం లాభంతో రూ.621 వద్ద ముగింపు  న్యూఢిల్లీ: అర్‌వింద్ కంపెనీ నుంచి విడివడిన(డీమెర్జ్‌ అయిన) అర్వింద్‌ ఫ్యాషన్స్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం లిస్ట్‌ అయింది. లాల్‌భాయ్‌ గ్రూప్‌నకు చెందిన ఈ దుస్తులు, యాక్సెసరీల కంపెనీ రూ.592 వద్ద స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.621 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,603 కోట్లుగా నమోదైంది. అంతర్జాతీయ బ్రాండ్లు-టామీ హిల్‌ఫిగర్‌, కాల్విన్‌ క్లెయిన్‌,

Most from this category