STOCKS

News


త్వరలో టీసీఐఎల్‌ ఐపీవో

Monday 5th November 2018
Markets_main1541393982.png-21705

న్యూఢిల్లీ: టెలికం రంగానికి సంబంధించి ఇంజనీరింగ్‌ అండ్‌ కన్సల్టెన్సీ సేవలు అందించే ‘టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌)’లో 25 శాతం వాటాను ఐపీవో ద్వారా విక్రయించాలని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్లో ఐపీవో ఉండొచ్చని ఓ సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. నాలుగు ప్రభుత్వరంగ సంస్థలను లిస్ట్‌ చేయడంతోపాటు, టీసీఐఎల్‌ ఐపీవోకు సంబంధించి పని ఆరంభమైనట్టు చెప్పారు. ‘‘టీసీఐఎల్‌ ఐపీవోను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాం. 25 శాతం వాటా విక్రయానికి అనుమతి కోరుతూ త్వరలోనే కేబినెట్‌ను సంప్రదించనున్నాం’’ అని ఆ అధికారి తెలిపారు. టెలికం శాఖ పరిధిలో పనిచేసే టీసీఐఎల్‌ 1978లో ప్రారంభమైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.1,205 కోట్ల ఆదాయంపై రూ.70.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.15,000 కోట్లను సమీకరించింది. వీటిలో రైట్స్‌, ఇర్కాన్‌, మిధాని, గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీవోలు కూడా ఉన్నాయి. 
 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 5th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- జీడిమెట్లలో ఉన్న ముడి ఔషధాల (యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌-ఏపీఐ) తయారీ యూనిట్‌ విక్రయ ప్రక్రియను పూర్తి చేసింది. స్టెరైడ్‌ ఫార్మా సైన్స్‌:- ఇటీవల బెంగళూర్‌లో యూనిట్‌లో తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ప్లాంట్‌కు ‘‘జీరో’’ అబ్జర్వేషన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు కంపెనీల స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌:- ఆర్థిక మంత్రిత్వశాఖ డిసెంబర్‌ 15న నాటికి రూ.54వేల మూలధన

ప్రభుత్వ బ్యాంకులకు మరో రూ.54,000 కోట్లు

Monday 5th November 2018

న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు తగినంత మూలధనం సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాజా త్రైమాసికంలో ఆయా బ్యాంకుల పనితీరు ఆధారంగా నిధులను ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది రెండో విడత మూలధన నిధుల్లో భాగంగా రుణ వృద్ధి పెంచేందుకు... ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థ(ఎంఎస్‌ఎంఈ)లకు రుణాలే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. ఎంఎస్‌ఎంఈలకు రూ. కోటి వరకూ రుణాలను

Most from this category