STOCKS

News


ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనదు: ఐడీబీఐ బ్యాంక్‌

Wednesday 5th December 2018
Markets_main1543984839.png-22643

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా పెంచుకోవడానికి గాను ఎల్‌ఐసీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనడం లేదు.  ఐడీబీఐ బ్యాంక్‌ మంగళవారం ఈ విషయాన్ని తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్‌లో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తన వాటాను 51 శాతానికి పెంచుకుంటున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా 26 శాతం వాటా కొనుగోలు కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. షేరు ఒక్కింటికి రూ.61.73 చొప్పున మొత్తం రూ. 12,602 కోట్లకు ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్‌ షేర్లను కొనుగోలు చేయనున్నది. సోమవారం (ఈ నెల 3న) ఆరంభమైన ఈ ఓపెన్‌ ఆఫర్‌ ఈ నెల 14న ముగియనున్నది. ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 80 శాతానికి పైగా వాటా ఉంది. తాజా వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ 0.6 శాతం లాభంతో రూ.59.85 వద్ద ముగిసింది.



You may be interested

‘యస్‌’ బ్యాంకు నుంచి రెండు మ్యూచువల్‌ ఫండ్‌లు

Wednesday 5th December 2018

  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని యస్‌ బ్యాంక్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ, యస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ త్వరలో రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి ఆమోదం పొందినట్లు యస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తెలియజేసింది. యస్‌ లిక్విడ్‌ ఫండ్‌, యస్‌ ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌ల పేరుతో రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌ స్కీమ్‌లను త్వరలో​‍అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కాగా ప్రస్తుతం

ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్‌టీ రిటర్న్‌ ఫారాలు

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సరళంగా ఉండే కొత్త జీఎస్‌టీ ఫారాలను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను కచ్చితంగా సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పన్నులు ఎగవేస్తున్న సంస్థల వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తోందని డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న

Most from this category