STOCKS

News


ప్రభుత్వరంగ సంస్థల షేర్ల బైబ్యాక్‌తో రూ.5,000 కోట్లు

Monday 19th November 2018
Markets_main1542604425.png-22165

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో కోల్‌ ఇండియా కూడా ఉంది. కోల్‌ ఇండియాలో ఈ నెల మొదట్లో కేంద్రం 3.18 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించడం ద్వారా రూ.5,300 కోట్లు సమీకరించింది. ‘‘ఎనిమిది కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ప్రణాళికలు క్యూలో ఉన్నాయి. వీటితో రూ.5,000 కోట్లు సమకూరతాయి. కోల్‌ ఇండియా బైబ్యాక్‌ జనవరిలో ఉంటుంది’’ అని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. షేర్ల బైబ్యాక్‌ చేపట్టనున్నట్టు ఇప్పటికే ఆరు ప్రభుత్వరంగ సంస్థలు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేశాయి. వీటి ద్వారా రూ.3,000 కోట్లను కేంద్రం రాబట్టుకోనుంది. ఎన్‌హెచ్‌పీసీ, బీహెచ్‌ఈఎల్‌, నాల్కో, ఎన్‌ఎల్‌సీ, కొచిన్‌ షిప్‌యార్డ్‌, కేఐవోసీఎల్‌ వీటిల్లో ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ (దీపమ్‌) ప్రభుత్వరంగ సంస్థల షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనలపై చర్చించిన విషయం గమనార్హం. 2016 మే 27న దీపమ్‌ మూలధన పునరుద్ధరణ మార్గదర్శకాలను జారీ చేసింది. అనంతరం ప్రభుత్వరంగ సంస్థలను షేర్ల బైబ్యాక్‌ చేపట్టాలని కేంద్రం కోరింది. ఈ మార్గదర్శకాల ప్రకారం... రూ.2,000 కోట్ల నెట్‌వర్త్‌ ఉండి, నగదు నిల్వలు కనీసం రూ.1,000 కోట్ల మేర కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ చేపట్టాల్సి ఉంటుంది. కంపెనీ జారీ మూలధనం నుంచే కొన్ని వాటాలను తిరిగి కొనుగోలు చేయడమే బైబ్యాక్‌. కొనుగోలు చేసిన మేర ఈక్విటీ రద్దవుతుంది. దాంతో కంపెనీలో మిగిలిన వాటాలకు అదనపు విలువ చేకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. 



You may be interested

358 ప్రాజెక్టులు... రూ.3.37 లక్షల కోట్ల భారం

Monday 19th November 2018

న్యూఢిల్లీ: మౌలికరంగంలో వందలాది ప్రాజెక్టులు అధిక వ్యయ భారాన్ని మోస్తున్నాయి. రూ.150 కోట్లు అంతకంటే అధిక అంచనాతో కూడిన 358 ప్రాజెక్టులపై జాప్యం, ఇతరత్రా కారణాలతో  రూ.3.37 లక్షల కోట్ల మేర అదనపు వ్యయ భారం పడినట్టు కేంద్ర ప్రణాళిక, అమలు విభాగం నివేదిక తెలియజేస్తోంది. ‘‘1,361 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.16,78,634 కోట్లు. పూర్తయ్యే నాటికి వీటి వ్యయం రూ.20,16,361 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పెరిగిన

పారిశ్రామిక దిగ్గజాలతో నేడు ప్రధాని భేటీ

Monday 19th November 2018

న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు తీసుకోతగిన మరిన్ని చర్యలపై చర్చించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు, విధానకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశం కానున్నారు. టాప్ 50 దేశాల జాబితాలోకి చేందుకు ‍అవసరమైన చర్యలు చర్చించనున్నారు. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం దీన్ని నిర్వహిస్తోంది. ఆనంద్‌ మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గజాలు, సీఐఐ .. ఫిక్కీ .. అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యల ప్రతినిధులతో పాటు ఈజ్ ఆఫ్

Most from this category