STOCKS

News


15 నుంచి గోల్డ్ బాండ్స్‌ స్కీమ్‌

Tuesday 9th October 2018
Markets_main1539059628.png-20959

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. అక్టోబర్ 19 దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. 23న బాండ్ల జారీ ఉంటుంది. ఫిబ్రవరి దాకా మొత్తం అయిదు విడతల్లో బాండ్ల జారీ ఉండనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.  తదుపరి విడతల తేదీలు నవంబర్ 5-19 (నవంబర్ 13న జారీ), డిసెంబర్‌ 24-28 (జారీ జనవరి 1), జనవరి 14-18 (జారీ జనవరి 22), ఫిబ్రవరి 4-8 (జారీ ఫిబ్రవరి 12)గా ఉంటాయని వివరించింది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీలైన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. మరోవైపు, వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా రుణగ్రహీతలకు ఆ ప్రయోజనాలను బదలాయించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుండటంపై అభిప్రాయాన్ని ఆరు వారాల్లోగా తెలియజేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. మనీలైఫ్ ఫౌండేషన్‌ వేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. 



You may be interested

టాటా ఎలెక్సీ అమ్మకాలు రూ.403 కోట్లు

Tuesday 9th October 2018

 ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన ఐటీ కంపెనీ, టాటా ఎలెక్సీ నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.403 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర అమ్మకాలతో (రూ.342 కోట్లు) పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని టాటా ఎలెక్సీ తెలిపింది. నికర లాభం రూ.57 కోట్ల నుంచి 44 శాతం వృద్ధితో రూ.82 కోట్లకు ఎగసిందని పేర్కొంది. ఎబిట

నేడు పీఎస్‌యూ బ్యాంక్‌ ఉద్యోగుల నిరసన

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకగా బ్యాంకు ఉద్యోగుల యూనియన్‌ ఒక రోజు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంకులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు (అక్టోబరు 9న) దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, రాష్ట్ర రాజధానులలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రెటరీ వెంకటాచలం వెల్లడించారు. గత నెల 29న

Most from this category