STOCKS

News


మంచి స్టాక్స్‌ను పట్టుకునే అవకాశం ఇదే...

Friday 21st September 2018
Markets_main1537553872.png-20455

స్టాక్‌ మార్కెట్లలో శుక్రవారం సాగిన తీవ్ర ఆటుపోట్లు, నష్టాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకుపైగా పతనం కావడం, నిఫ్టీ-50 11,346 స్థాయి నుంచి 10,866 స్థాయి వరకూ పడిపోవడంతో ఏం జరుగుతుందోనన్న కంగారు ఏర్పడింది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల్లో విస్తృత అమ్మకాలే మార్కెట్‌ సెంటిమెంట్‌ను గాయపర్చాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కమర్షియల్‌ పేపర్లపై వడ్డీ చెల్లింపులు విఫలం కావడంతో, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ తదితర ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలపైనా సందేహాలు తలెత్తడంతో మూకుమ్మడి అమ్మకాలు జరిగాయి. దీంతో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు కకావికలం అయ్యాయి. ఇదే మార్కెట్‌లో అమ్మకాలకు కారణమైంది. అయితే, తమవద్ద తగినంత లిక్విడిటీ ఉందని, ఎటువంటి సమస్య లేదని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్పష్టం చేయడంతో ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌తోపాటు, మార్కెట్లు కూడా తిరిగి కోలుకున్నాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 6.7 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 6.6 శాతం వరకూ నష్టపోవడం గమనార్హం. 

 

అందరూ భయపడి అమ్ముతున్న వేళ కొనుగోలుకు ఆశ చూపాలని, అందరూ ఆశపడుతున్న వేళ వాటిని విక్రయించాలన్నది అమెరికన్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ సూత్రం. కనుక ఈ రకమైన మార్కెట్‌ పరిస్థితులు ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్న మంచి నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకునేందుకు చక్కని అవకాశమని నిపుణులు సూచిస్తు‍న్నారు. శుక్రవారం నాటి మార్కెట్ల పతనం వెనుక ఎటువంటి ప్రధాన కారణం లేదని, సాంకేతిక అంశాలే ఈ పరిస్థితికి దారితీశాయని మార్కెట్‌ వెటరన్‌ మధుకేల తెలిపారు. ఈ తరహా భయానక పరిస్థితులు మార్కెట్లో మంచి స్టాక్స్‌ కొనుగోలుకు మ్యూచువల్‌ ఫండ్స్‌కు చక్కని అవకాశమని కోటక్‌ మహింద్రా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఐవో లక్ష్మీ అయ్యర్‌ పేర్కొన్నారు. డెట్‌ ఫండ్‌ ఎన్‌ఏవీలను ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏదీ లేదని స్పష్టం చేశారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రెండు కమర్షియల్‌ పేపర్లకు సంబంధించి చెల్లింపుల్లోనే విఫలమైందని, ఇది మొత్తం ఎన్‌బీఎఫ్‌సీ విభాగంపై ప్రభావం చూపించదని నార్నోలియా ఫైనాన్షియల్‌ అ‍డ్వైజర్స్‌ సీఐవో శైలేంద్ర కుమార్‌ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు హోల్‌సేల్‌గా నిధులు సమీకరిస్తే, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు కమర్షియల్‌ పేపర్ల ద్వారా నిధులు సమకూర్చుకుంటుంటాయి. పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ పెరగడంతో వీటి మార్జిన్లపై ఒత్తిడి పడనుంది.



You may be interested

‘యస్‌ బ్యాంకు’ విషయంలో ముందున్న మార్గం?

Friday 21st September 2018

యస్‌ బ్యాంకు విషయంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ గాయపడినట్టు శుక్రవారం నాటి పతనం తెలియజేస్తోంది. బ్యాంకు సీఈవో, ఎండీగా రాణా కపూర్‌ పదవీకాలాన్ని వచ్చే ఏడాది జనవరికి ఆర్‌బీఐ తగ్గించడం ఈ పరిస్థితికి కారణం. ఇంట్రాడేలో 34 శాతం పతనమై 210.10 స్థాయిల వరకు వెళ్లింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి. అంతేకాదు కొన్ని సంవత్సరాల కనిష్ట స్థాయి కూడా. చివరికి 28 శాతం నష్టంతో బీఎస్‌ఈలో రూ.227.05 వద్ద

ఫండ్స్‌పై సెబీ ఆదేశాల ప్రభావం ఏ మేర?

Friday 21st September 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడుల నిర్వహణ బాధ్యతలు చూసే ఏఎంసీలు, అందుకు గాను ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియోను తగ్గిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. తమ వ్యయాలను ఏఎంసీలు టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌) రూపంలో రాబట్టుకుంటాయి. ఇందుకు సంబంధించి నిబంధనలను సెబీ సవరించింది. ఇది కచ్చితంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు మేలు చేసేదే. అయితే, ఈ నిబంధనల ప్రభావం ఎలా ఉంటుందన్నది ప్రతీ

Most from this category