STOCKS

News


అక్టోబర్‌ ఆరంభం అదిరింది.

Monday 1st October 2018
Markets_main1538390033.png-20761

మిడ్‌సెషన్‌ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ సోమవారం భారీగా లాభపడింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు, ఐటీ, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 300 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 11వేల ఎగువన ముగిసింది.  సెన్సెక్స్‌ 299 పాయింట్ల లాభంతో 36,526 వద్ద ముగియగా, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 11,008.30 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 1శాతం(247 పాయింట్లు) లాభపడి 25,367 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ తప్ప మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకు సూచి 3.50శాతం లాభపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,960.65 - 36,616.64 పాయింట్ల శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,821 - 11,035 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యింది.
మిడ్‌సెషన్‌ వరకు అమ్మకాల వెల్లువ:-
దేశీయంగా మార్కెట్‌ నేడు ఫ్లాట్‌ ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 47 పాయింట్ల లాభంతో 36,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ గత ముగింపు 10,930 వద్దే ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత, దేశీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితలు కారణంగా సూచీలు క్షణాలు నష్టాల్లోకి మళ్లాయి. మార్కెట్లో వెల్లువెత్తిన అమ్మకాల కారణంగా మార్కెట్‌లో గంటకు గంటకు నష్టాలు పెరిగాయి. ఈ క్రమంలో మిడ్‌ సెషన్‌ సమయానికల్లా సెన్సెక్స్‌ 36వేల స్థాయిని, నిఫ్టీ సూచి 10,850 స్థాయిలను కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. మొత్తానికి సెన్సెక్స్‌ సూచీ 267 పాయింట్లను నష్టపోయి 35,960 వద్ద, 10,821ల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
అదరగొట్టిన ఐటీ షేర్లు:-
మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో ఐటీ షేర్లు సూచీలకు అండగా నిలిచాయి. మిడ్‌సెషన్‌ సమయానికి  ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో  ట్రేడ్‌ అవుతున్నప్పటికీ ఒక్క ఐటీ రంగ సూచీ మాత్రం భారీగా లాభపడింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఐటీ ఇందుకు కారణమైంది. రూపాయి బలహీనతతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. టీసీఎస్‌ 4శాతం, ఇన్ఫోసిస్‌ 3.50శాతం లాభపడి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. క్రితం వారంలో ఒక్కరోజులో 70 శాతం పతనమయిన ఇన్ఫీబీమ్‌ నేటి ఇంట్రాడేలో 15శాతం లాభపడింది.  
మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్ల పర్వం:-
మిడ్‌సెషన్‌ వరకు అ‍మ్మకాల సునామిలో భారీగా పతనమైన సూచీలు అటు పిమ్మట కొనుగోళ్లతో తిరిగి లాభాల బాట పట్టాయి. సెప్టెంబర్‌లో మెరుగైన తయారీ గణాంకాలు ఇన్వెస్టర్ల ఉత్సాహానిచ్చాయి. ప్రధాన షేర్లు చౌక ధరల్లో లభిస్తుండంతో మార్కెట్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మిడ్‌ సెషన్‌ అనంతరం ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. పలితంగా ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా లాభపడ్డ ఇండెక్స్‌గా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకింగ్‌ సూచి(3.50శాతం)నిలిచింది. ముఖ్యంగా క్రమక్రమంగా కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్‌ 389 పాయింట్లు లాభపడి 36,616.64 వద్ద,నిఫ్టీ 105 పాయింట్లు ఆర్జించి 11,035.65 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. చివరి సెన్సెక్స్‌ 36,526 వద్ద, నిఫ్టీ 11,008 వద్ద ముగిసింది.
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిక్‌ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, భారతిఎయిర్‌టెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4శాతం వరకు నష్టపోయాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, యస్‌బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 9శాతం లాభపడ్డాయి.



You may be interested

అప్పుల ఊబికి ఐదు సంకేతాలు..

Monday 1st October 2018

ఈ సిగ్నల్స్‌ వస్తే రుణభారం మోయలేనట్లే లెక్క తక్షణ చర్యలు తీసుకోకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం... శ్రుతిమించిన అప్పులతో మితిమీరిన తిప్పలు వస్తాయి.. అందువల్ల ఎప్పటికప్పుడు రుణాలను కంట్రోల్‌లో ఉంచుకోవడం ఉత్తమం. ఒక్కోసారి పరిస్థితులు మన చేతిలో ఉండవు. అలాంటప్పుడు తలకుమించిన అప్పులు చేస్తాం. వీటిని సకాలంలో తీర్చగలిగితే ఓకే, లేదంటే రుణ ఊబిలోకి జారడం ఖాయం. మనం రుణాల అగాధంలో పడిపోతున్నామనేందుకు ఐదు సంకేతాలుంటాయని పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు చెబుతున్నారు.

జున్‌జున్‌వాలాకూ ఒక్క నెలలో రూ.1,300 కోట్ల నష్టాలు!

Monday 1st October 2018

సాధారణ ఇన్వెస్టర్లకే కాదు... బిలియనీర్‌ ఇన్వెస్టర్‌, ఏస్‌ ఇన్వెస్టర్‌గా పేరొందిన జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో సైతం తాజా కరెక్షన్‌లో నెగెటివ్‌ (మైనస్‌) రిటర్నుల్లోకి వెళ్లిపోయింది. కేవలం గత నెల రోజుల్లోనే ఆయన టాప్‌ 10 హోల్డింగ్స్‌పై రూ.1,300 కోట్ల నష్టాలు (12.3 శాతం) చూపిస్తున్నాయి. అదే ఈ ఏడాది ఇంత వరకు చూస్తే నికరంగా రూ.1,196 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఇది 11.4 శాతానికి సమానం. జున్‌జున్‌వాలా టాప్‌ 10 హోల్డింగ్స్‌

Most from this category