STOCKS

News


బ్యాంకింగ్‌ షేర్ల కొనుగోలుకు ఇదే సరైన సమయం

Tuesday 6th November 2018
Markets_main1541499927.png-21761

  • క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా సంజయ్‌ దత్‌ వ్యాఖ్య

ముంబై: తాజా కరెక్షన్‌ దెబ్బతో స్టాక్‌ మార్కెట్‌లోని అతి ఆశావాదం ముగిసిందని, పతనం వల్ల నురుగు చల్లారిపోయినట్లేనని క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా సంజయ్‌ దత్‌ వ్యాఖ్యానించారు. రానున్న ఏడాదికాలంలో మార్కెట్‌ బెటర్‌గానే ఉంటుందన్నారు. అయితే, జాగ్రత్తగా మాత్రమే పెట్టుబడులను కొనసాగించడం మంచిదని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫలితాలు ఆశించిన స్థాయిలో లేనందున షాపింగ్‌ లిస్ట్‌ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. వచ్చేది ఎన్నికల సీజన్‌ అనే అంశాన్ని మరిపోవద్దని ఇన్వెస్టర్లకు సూచించారు. బ్యాంకింగ్‌ రంగం క్రమంగా ఆకర్షణీయంగా మారిపోతుందని వివరించిన ఆయన.. ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ సమయంలో కొనుగోలుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. డెట్‌ విషయానికి వస్తే.. ఈ అంశంపై ప్రభుత్వం, ఆర్‌బీఐ తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య ఇక మీదట ఉండకపోవచ్చని విశ్లేషించారు. ఐటీ రంగంలో మాత్రం ఎంపికచేసిన లార్జ్‌క్యాప్‌ షేర్లను చూడమని సూచించారు. వచ్చే 18-24 నెలల కోసం నాణ్యమైన పలు షేర్లను ఎంచుకోమని సూచించిన ఆయన.. వీటిలో 5-10 శాతం పతనం నమోదైనప్పటికీ రిస్క్‌ రివార్డ్‌ సానుకూలంగా ఉంటుందన్నారు.



You may be interested

సంవత్‌ ‘2075’ కలిసొస్తుంది..

Tuesday 6th November 2018

సంవత్‌ 2075 ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తుందని ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా ఫౌండర్‌, సీఈవో పొరింజు వెలియత్‌ తెలిపారు. కరెక‌్షన్‌కు గురైన, బాగా పడిపోయిన స్టాక్స్‌ మళ్లీ పెరుగుతాయని ధీమా వ్యక్తంచేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల ఈ విషయాలు వెల్లడించారు. ‘సంవత్‌ 2075 ప్రారంభమౌతోంది. మంచి ఆరంభం ఉంటుందని భావిస్తున్నా. ప్రస్తుతం మనం ఓవర్‌సోల్డ్‌ మార్కెట్‌లో ఉన్నాం. గత దీపావళి రోజున మార్కెట్‌లో ఓవర్‌బాట్‌, అధిక వ్యాల్యుయేషన్స్‌

ఒడిదుడుకులు కొనసాగుతాయి: సమీర్‌ అరోరా

Tuesday 6th November 2018

ఫైనాన్స్‌ రంగంలో ప్రైవేట్‌ బ్యాంక్‌, బీమా, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను చూడవచ్చని సూచించిన సమీర్‌  ముంబై: మార్కెట్‌ భారీ హెచ్చు తగ్గుల సమయంలో కూడా మంచి రాబడిని పొందినట్లు హీలియోస్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు, ఫండ్‌ మేనేజర్‌ సమీర్‌ అరోరా వెల్లడించారు. ఈ ఏడాది ఒడిదుడుకుల మార్కెట్‌లో షార్ట్‌ బుక్‌ చేయడం ద్వారా 28 శాతం రాబడిని తాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలం ఎక్స్‌పోజర్‌ కలిగిన పలు ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను హెడ్జింగ్‌ చేయడం

Most from this category