STOCKS

News


ఈ ఏడాది చిన్నస్టాకులదే రాజ్యం!

Friday 11th January 2019
Markets_main1547202222.png-23537

అనలిస్టుల అంచనా
గతేడాది పలువురు ఇన్వెస్టర్లకు చుక‍్కలు చూపిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఈ సంవత్సరం కోలుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత గణాంకాల ఆధారంగా చూస్తే ఒక ఏడాది పేలవ ప్రదర్శన అనంతరం తరువాత సంవత్సరం మంచి రాబడులను చిన్న స్టాకులు అందించినట్లు తెలుస్తోందన్నారు. ఉదాహరణకు 2013లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ సూచీలు వరుసగా 6, 11 శాతం మేర నష్టపోయాయి. ఆ ఏడాది ప్రధాన సూచీలు 9 శాతం లాభపడ్డాయి. 2014 పూర్తయ్యేసరికి మిడ్‌క్యాప్‌ సూచీ 54.7 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 69.2 శాతం దూసుకుపోయాయి. ఇదే సమయంలో ‍ప్రధాన సూచీలు కేవలం 30 శాతం మాత్రమే లాభపడ్డాయి. 2102లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 36, 38 శాతం లాభాలు నమోదు చేశాయి. ఆ ఏడాది సెన్సెక్స్‌ 26 శాతం ముందంజ వేసింది. 2011లో మిడ్‌క్యాప్‌ సూచీ 34 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 43 శాతం క్షీణించాయి. గత 13సంవత్సరాల్లో ఒక ఏడాది బాగుంటే మరో ఏడాది పనతం కావడం తిరిగి మరుసటి ఏడాది దూసుకుపోవడమనేది చిన్న స్టాకులకు అలవాటుగా మారింది. కేవలం 2010, 2011లో మాత్రం వరుసగా రెండేళ్లపాటు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

పుష‍్కరకాలంలో 2009 చిన్న స్టాకులకు అత్యద్భుతంగా కలిసివచ్చింది. ఆ ఏడాది స్మాల్‌క్యాప్‌ సూచీ 127 శాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 180 శాతం దూసుకుపోయాయి. ఆ ఏడాది ప్రధాన సూచీలు దాదాపు 81 శాతం లాభపడ్డాయి. 2008 సుదీర్ఘ పతనానంతరం 2009లో సూచీలు బలంగా బౌన్సయ్యాయి. ఈ దఫా కూడా ఇదే ధోరణి రిపీటవుతుందని చాలామంది అనలిస్టులు భావిస్తున్నారు. అయితే 2013లో మిడ్‌క్యాప్‌ సూచీ పీఈ 4 వద్ద ఉందని, దాంతో ఎక్కువ ఎంఎఫ్‌లు ఇబ్బడిముబ్బడిగా చిన్నస్టాకులను కొన్నాయని, ఈ సారి వాల్యూషన్లు మరీ అంత చౌకగా ఏమీ లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంత కరెక‌్షన్‌ వచ్చినా మిడ్‌క్యాప్స్‌ ఇంకా చీప్‌జోన్‌లోకి రాలేదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ భావిస్తోంది. గతేడాది మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు దాదాపు 20 శాతానికి పైగా పతనమయ్యాయి. అయితే వీటిలో చాలా స్టాకుల వాల్యూషన్లు దిగివచ్చాయని ఇతర బ్రోకరేజ్‌లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలెన్స్‌డ్‌ పోర్టుఫోలియో ఏర్పాటు చేసుకొని నాణ్యమైన చిన్నస్టాకులకు పోర్టుఫోలియోలో 40 శాతం వరకు వెయిటేజ్‌ ఇవ్వడం మేలని అధికుల సూచన.You may be interested

కొత్త ఇన్వెస్టర్లు... స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ ఎలా?

Saturday 12th January 2019

ఈ ప్రశ్న... కొత్తగా స్టాక్‌ మార్కెట్లలోకి అడుగు పెట్టే ప్రతీ ఇన్వెస్టర్‌ నుంచి ఎదురయ్యేదే. స్టాక్‌ మార్కెట్లో స్వల్ప కాలంలోనే భారీ లాభాలు, నష్టాలు వస్తాయని తెలుసు. కానీ, లాభాలు ఎలా, నష్టాలు ఎలా అన్నది వివరంగా తెలిసిన వారు కొద్ది మందే ఉంటారు. ‘స్టాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను నేను ఎక్కడ ఆరంభించాలి...? నాకు ఏ మాత్రం విషయ జ్ఞానం లేదు...’ అంటూ ఓ ఔత్సాహిక ఇన్వెస్టర్‌ వేసిన ప్రశ్నకు... చార్టర్డ్‌

10800 దిగువన నిఫ్టీ ముగింపు

Friday 11th January 2019

ఐటీ, అటో రంగ షేర్ల క్షీణతతో మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 10800 మార్కును కోల్పోయింది. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు సూచీలు లాభాలతో ప్రారంభయ్యాయి. అయితే ఇంట్రాడేలో ఐటీ, అటో, ఇన్ఫ్రా, షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు నష్టాల బాట పట్టాయి. అలాగే మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ రంగాలకు చెందిన షేర్లలో సైతం అమ్మకాలు సూచీల ట్రేడింగ్‌పై

Most from this category