STOCKS

News


వాల్యూ స్టాకులు ఎప్పటికీ విలువైనవే!

Friday 17th May 2019
Markets_main1558087736.png-25801

గత కొన్నేళ్లుగా మార్కెట్లో కొత్త పెట్టుబడులకు స్టాకుల వాల్యూషన్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. చాలా స్టాకుల వాల్యూషన్లు భారీగా పెరగడంతో వీటిలో పెట్టుబడులకు వెనకాడాల్సిన పరిస్థితి ఉంది. దీనికితోడు ఇంత వాల్యూషన్లకు సరిపడా ఎర్నింగ్స్‌ గ్రోత్‌ కానరాకపోవడం కూడా నెగిటివ్‌గా మారింది. దీంతో కేవలం కొన్ని నాణ్యమైన కంపెనీల్లో మాత్రమే మార్చిమార్చి పెట్టుబడులు పెట్టడం కనిపిస్తోంది. ఇలాంటి బడా కంపెనీలే పోర్టుఫోలియోలకు స్థిరత్వాన్నిస్తున్నాయి. కానీ వీటిలో కూడా వాల్యూషన్లు బాగా పెరగడం ఆందోళనకరం. ఇలాంటప్పుడు వీటిలోనే అత్యున్నత వ్యాపార నిర్వహణ, మంచి ఆర్థిక బలం ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి. ఇలాంటి కంపెనీల స్టాకులు కొన్నిసార్లు కరెక‌్షన్‌కు గురైనా, తిరిగి కోలుకొనే సత్తా కలిగి ఉంటాయి. కొన్నిసార్లు స్వల్పకాల పరిస్థితులు ఇలాంటి స్టాకుల్లో పతనం తీసుకువస్తాయి. ఇలా పతనం బాట పట్టినా కొన్ని షేర్లు కొంచెం ఎక్కువ వాల్యూషన్ల వద్దనే ఉంటాయి. అలాంటప్పుడు వాల్యూషన్లను పట్టించుకోకుండా వీటిని దిగువ స్థాయిల వద్ద కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా నాణ్యమైన బ్యాక్‌గ్రౌండ్‌ ఉండి, కరెక‌్షన్‌ దశలో పయనించి, స్థిరమైన ఎర్నింగ్స్‌ నమోదు చేస్తూ, ప్రస్తుత పీఈ వాటి ఐదేళ్ల సరాసరి పీఈ కన్నా తక్కువగా ఉన్నటువంటి కొన్ని స్టాకులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.



You may be interested

డా.రెడ్డీస్‌ లాభంలో 44 శాతం వృద్ధి

Friday 17th May 2019

మార్చి త్రైమాసికానికి డా.రెడ్డీస్‌ ల్యాబ్‌ నికరలాభం 44 శాతం పెరిగి రూ. 434.40 కోట్లను చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 302.20 కోట్ల లాభం నమోదు చేసింది. అయితే క్యు3తో పోలిస్తే నికరలాభం 10 శాతం పతనమైంది. క్యు4లో విక్రయాలు గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి రూ. 4016.6 కోట్లకు చేరాయి. ఎబిటా మార్జిన్‌ 2017-18క్యు4లో 16.3 శాతం, 2018-19క్యు3లో 22.5 శాతం ఉండగా, తాజా

8శాతం లాభపడ్డ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు

Friday 17th May 2019

ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు శుక్రవారం 4శాతం పెరిగాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.111.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తన హోల్‌సేల్‌ రియల్‌ఎస్టేట్‌ రుణాలను అమెరికా ఆధారిత​ కంపెనీ ఓక్‌ట్రీ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు 17,000-18,000 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ నాన్‌బిండింగ్‌ ఒప్పందంపై సంతకం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే మరో రెండు నెలల్లో రూ.8400 కోట్ల రుణ, సెక్యూరిటైజేషన్ చెల్లింపులను

Most from this category