STOCKS

News


పసిడే పదిలం..

Thursday 28th March 2019
Markets_main1553759265.png-24841

- అంతర్జాతీయంగా అనిశ్చితి
- అమెరికాలో మాంద్యం భయాలు
- సుర క్షితమైన బంగారంవైపు ఇన్వెస్టర్ల మొగ్గు
- దేశీయంగా రేటు రూ. 38,000కు పెరగొచ్చన్న అంచనాలు

    అగ్రరాజ్యం అమెరికా మళ్లీ మాంద్యంలోకి జారిపోనుందన్న భయాలు ఒకవైపు ప్రపంచ దేశాల వృద్ధి మందగించవచ్చన్న ఆందోళన మరోవైపు.. ఇన్వెస్టర్లను మళ్లీ పసిడి వైపు మళ్లేలా చేస్తున్నాయి. పదేళ్ల అమెరికా ట్రెజరీ బాండ్‌ రేటు.. మూడు నెలల రేట్ల కన్నా దిగువకి పడిపోవడం... అగ్రరాజ్యంలో మాంద్యం రాబోతోందనడానికి గట్టి నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడివైపు చూడటానికి కూడా ఇదొక కారణం కాగలదని వారంటున్నారు. ఇక అమెరికా డాలరు, బంగారం ధరలు వ్యతిరేక దిశల్లో నడుస్తుంటాయి. ఉదాహరణకు  డాలరు పెరిగితే పసిడి రేటు తగ్గడం, డాలరు బలహీనపడితే బంగారం రేటు పెరగడం జరుగుతుంటుంది. డాలరు బలహీనపడిన పక్షంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు పసిడిని ఎంచుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. 
    డాలరు బలహీనత నేపథ్యంలో గడిచిన మూడు వారాలుగా భారత్‌లో పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ్ర»ñ గ్జిట్‌పై అనిశ్చితి, ప్రపంచ దేశాల వృద్ధి మందగించవచ్చన్న అంచనాలు కూడా ఇందుకు కొంత కారణం. అమెరికా విషయానికొస్తే.. గత వారంలో విడుదలైన డేటా ప్రకారం.. మార్చిలో తయారీ కార్యకలాపాలు అనూహ్యంగా మందగించాయి. యూరోజోన్‌లో వ్యాపారాల పనితీరు .. అంచనాల కన్నా తక్కువ స్థాయిలో ఉంది. దీంతో అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోలో పసడిని పెంచుకోవడం శ్రేయస్కరమని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే 12 నెలల వ్యవధిలో దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 38,000 స్థాయిని తాకే అవకాశాలు ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ (కమోడిటీస్‌) కిశోర్‌ నార్నె తెలిపారు. ప్రస్తుతం పసిడి రేటు రూ. 32,700 స్థాయిలో కదలాడుతోంది. 

అయిదేళ్లుగా దూరం...
పసిడిపై రాబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఈక్విటీ మార్కెట్లు భారీ రాబడులు అందిస్తుండటం వంటి అంశాల కారణంగా గడిచిన అయిదేళ్లుగా చాలా మంది ఇన్వెస్టర్లు పసిడి నుంచి తప్పుకుంటూ వస్తున్నారు. గత అయిదేళ్ల గణాంకాలు చూస్తే పసిడిపై రాబడి ఒక మోస్తరుగా లేదా.. ఒకే స్థాయిలో ఉండిపోగా, ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సూచీ 11.37 శాతం మేర రాబడులు ఇచ్చింది. అయితే, తాజా పరిస్థితులను బట్టి చూస్తే.. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో సుమారు 5–10 శాతాన్ని బంగారానికి కేటాయించే అంశం పరిశీలించవచ్చని వెల్త్‌ మేనేజర్లు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు విషయంలో కఠిన వైఖరి కాకుండా కాస్త ఆచితూచి వ్యవహరించాలని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ యోచిస్తుండటాన్ని చూస్తే అక్కడి ఎకానమీ వృద్ధి కొంత మందగిస్తోందని భావించవచ్చని ప్లాన్‌ ఎహెడ్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు విశాల్‌ ధావన్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పోర్ట్‌ఫోలియోల్లో పసిడికి చోటు కల్పించే అవసరం ఉంటుందని వివరించారు. 

పది శాతం దాకా కేటాయింపులు...
మరీ ఎక్కువగా రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 10 శాతం దాకా నిధులను బంగారానికి కేటాయించవచ్చని ఆయన సూచించారు. అది కూడా ఏకమొత్తంగా కాకుండా క్రమంగా మూడు నెలల వ్యవధిలో కొనుగోళ్లు జరపవచ్చని తెలిపారు. నాణేలు, కడ్డీలు వంటి భౌతిక రూపంలోని పసిడి కొనుగోళ్ల కన్నా గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, ప్రభుత్వం జారీ చేసే సార్వభౌమ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీ) మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చని ధావన్‌ వివరించారు. వీటిల్లోనూ ఈటీఎఫ్‌ల కన్నా.. పసిడి రేటుకు మించి కొంత అధికంగా 2.5 శాతం మేర వడ్డీ చెల్లించే సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ను పరిశీలించవచ్చని సూచించారు.

 You may be interested

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి బుల్లెట్ ట్రయల్స్

Thursday 28th March 2019

ధరల శ్రేణి రూ.1.62 లక్షలు–2.07 లక్షలు న్యూఢిల్లీ: లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. బుల్లెట్ ట్రయల్స్ 350, 500 వెర్షన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1948-1965 మధ్యకాలంలో 50కి మించి ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న జానీ బ్రిటెన్ ట్రయల్స్ మోటార్‌సైకిల్ ప్రేరణతో ఈ బైక్‌లను రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది. 348 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన 350 వెర్షన్‌ ధర రూ.1.62 లక్షలు కాగా, 498 సీసీ 500 వెర్షన్‌

డాలర్‌ ఎఫెక్ట్‌: నష్టాల్లోకి పసిడి

Thursday 28th March 2019

డాలర్‌ ర్యాలీ కారణంగా గురువారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు నష్టపోయింది.యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై స్పష్టమైన సమాచారం లేకపోవడం అమెరికా యూఎస్‌ క్రూడ్‌ ఇన్వెంటరీ నిల్వలు అంచనాలకు మించి నమోదు కావడంతో ముడిచమురు ధరలు సైతం తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు డాలర్‌ ర్యాలీకి తోడ్పడ్డాయి. ఫలితంగా గత రెండు రోజులుగా ర్యాలీ కొనసాగిస్తూ నేడు కూడా ఆరు

Most from this category