STOCKS

News


భారత్‌కు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌

Tuesday 19th March 2019
Markets_main1552973979.png-24679

గోల్డ్‌మన్‌ సాక్స్‌ నిర్ణయం
భారత మార్కెట్‌ రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ సాక్స్‌ ప్రకటించింది. దీంతో పాటు నిఫ్టీ ఏడాది టార్గెట్‌ను 12500 పాయింట్లుగా నిర్ణయించింది. మార్చి ఆరంభం నుంచి దేశ మార్కెట్లు కీలక నిరోధాలు దాటి పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్‌ 38వేల పాయింట్లను, నిఫ్టీ 11400 పాయింట్లను దాటేశాయి. ఈ ర్యాలీ ఎఫ్‌ఐఐల కారణంగా ఏర్పడిన ప్రీఎలక‌్షన్‌ ర్యాలీ అని గోల్డ్‌మన్‌సాక్స్‌ తెలిపింది. మార్చిలో ఇంతవరకు ఎఫ్‌పీఐలు దాదాపు 21వేల కోట్ల రూపాయలను దేశ మార్కెట్లో కుమ్మరించాయి. ఇదే సమయంలో డీఐఐలు దాదాపు 10500 కోట్ల రూపాయల విక్రయాలు జరిపాయి. ఈ ఏడాది ఎర్నింగ్స్‌ 16 శాతం మేర వృద్ది నమోదు చేయవచ్చని గోల్డ్‌మన్‌ అంచనా వేసింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే గరిష్ఠ ఎర్నింగ్స్‌ వృద్ధి కావచ్చని తెలిపింది. తాజా అప్‌గ్రేడ్‌ నిర్ణయానికి క్యు3 ఫలితాలు బాగుండడం, మార్కెట్లు రికవరీ కావడం, ఎఫ్‌ఐఐల ప్రవాహం పెరగడం.. కారణాలని వివరించింది.

మరో ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం బోఫా ఎంఎల్‌ కూడా గోల్డ్‌మన్‌ నిర్ణయాన్ని బలపరిచింది. మార్కెట్లు ఎన్నికల ముందస్తు ర్యాలీ జరుపుతున్నాయని తెలిపింది. బీజేపీ విజయంపై పెరిగిన అంచనాలు ప్రీఎలక‌్షన్‌ ర్యాలీకి దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం వాల్యూషన్లు చూసినా భారత మార్కెట్‌ పీఈ ఇతర వర్ధమాన మార్కెట్ల సరాసరి కన్నా తక్కువే ఉందని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్‌కు నిఫ్టీ ఫెయిర్‌వాల్యూ 11300 పాయింట్లని తెలిపింది. రాబోయే రోజుల్లో లార్జ్‌క్యాప్‌ ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ మధ్య రొటేషన్‌ ఉండొచ్చని, మిడ్‌క్యాప్‌ డీరేటింగ్‌ కనిపించవచ్చని అభిప్రాయపడింది. 
 



You may be interested

మూడోరోజూ లాభాల్లోనే

Tuesday 19th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మూడో రోజూ లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత ఇందుకు కారణవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర మంగళవారం 6డాలర్లు పెరిగింది. నేటి నుంచి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. రేపటితో ముగిసే ఈ సమావేశంలో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీ

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 19th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌:- రూ.10 కోట్ల విలువైన బై బ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా ప్రతి షేరు ధర రూ.130లుగా నిర్ణయించారు. వక్రంజీ:- వైట్‌ లేబుల్‌ ఏటీఎంల పునరుద్ధరణకు ఆర్‌బీఏ ఆమోదం తెలిపింది.  ఏజిస్ లాజిస్టిక్స్:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండో మధ్యంతర డివిడెండ్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.1ముఖవిలువ కలిగిన ప్రతిషేరుకు రూ.0.50ల డివిడెండ్‌ను చెల్లించనుంది.  హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- జిరాక్స్‌ కార్పోరేషన్‌

Most from this category