STOCKS

News


సంపద సృష్టికి బంగారం వంటి సూత్రాలు!

Wednesday 6th March 2019
Markets_main1551812192.png-24442

ప్రతీ ఇన్వెస్టర్‌ ఇన్వెస్ట్‌ చేసే ముందు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు, వృద్ధికి అనుకూలంగా ఉన్నాయా అన్న అంశాలను తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆచరణలో సాధ్యం కావాలంటే ఎవరికి వారు ఇన్వెస్టర్‌గా ముందు తమ అవసరాలను అర్థం చేసుకోవాలి. సందేహంతో ఉంటే ఇందుకు స్మార్ట్‌ మార్గాన్ని ఎడెల్వీజ్‌ పర్సన్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌ సూచిస్తున్నారు. 

 

ప్రత్యేకమైన పెట్టుబడి లక్ష్యాలు
ఏం సాధించాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ లక్ష్యమే పెట్టుబడి లక్ష్యాల దిశగా నడిపిస్తుంది. ఉదాహరణకు రిటైర్మెంట్‌ కోసం, ఇంటి కొనుగోలుకు డౌన్‌ పేమెంట్‌ కోసం చేసే పెట్టుబడి లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. విడిగా మీ అవసరాలు, కోరికలకు అనుగుణంగా మీ పోర్ట్‌ఫోలియో ఉండేలా చూసుకోవాలి. మీ లక్ష్యాలకు తగినట్టు పోర్ట్‌ఫోలియో రాబడులు ఉండాల్సిన అవసరం ఉంది. కొంత కాలానికి సగటు రాబడులు ఇచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం జరగాలి. అలాగే, సంప్రదాయ పెట్టుబడి సాధనాల నుంచి బయటకు వచ్చి కూడా చూడాలి. సంప్రదాయ సాధనాలను ఎంచుకుంటే మీ పెట్టుబడులు వేగాన్ని అందుకోలేవు. అందుకే ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సాయంతో స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోర్ట్‌ఫోలియో మిశ్రమంగా ఉండేలా చూసుకోవాలి. 

 

కాల పరిమితి
పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్ణయించుకునే ముందు కాల పరిమితి ఎంత అన్నది కూడా తేల్చుకోవాలి. అంటే ఎప్పుడు మళ్లీ ఈ పెట్టుబడులు మీకు అవసరం అవుతాయనేది. మీకున్న కాల వ్యవధి, మీరు ఎంచుకునే పెట్టుబడి సాధనంపై ప్రభావం చూపిస్తుంది. ఏ తరహా పెట్టుబడి సాధనం ఎంచుకోవాలన్నదాన్ని నిర్ణయిస్తుంది. దీర్ఘకాలం అయితే పెట్టుబడుల విషయంలో ఉండే ఆటుపోట్లను అధిగమించొచ్చన్నది చాలా మంది ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు నమ్మే విషయం. మీకున్న కాల వ్యవధి కొంచెమే అయితే రాబడుల విషయంలో రాజీపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకున్న కాల పరిమితిలోపు మీ పెట్టుబడులు నమ్మకంగా మీకు అందుతాయన్న భరోసా వీటిల్లో ఉంటుంది.

 

టాస్క్‌
టాస్క్‌ను ఓ జట్టుగా పూర్తి చేసేందుకు కృష్టి చేయాలి. టీమ్‌ లీడర్‌ ఒక ప్రాజెక్టుకు సంబంధించి వివిధ పనులను బృందంలోని వారికి పంచుతాడు. ఒక్కొకరు ఒక్కో టాస్క్‌పై పనిచేయడం వల్ల వారు దానిపై మరింతగా దృష్టి సారిస్తారు. అలాగే, పెట్టుబడులు కూడా ఇదే విధంగా పనిచేయాలి. పెట్టుబడుల లక్ష్యాలను గుర్తించిన తర్వాత ప్రతీ దానికి ఒక్కో బ్రాకెట్‌ను రూపొందించుకోవాలి.  You may be interested

మిడ్‌క్యాప్‌ పోర్ట్‌ఫోలియో ఇలా రెడీ చేసుకుంటే...?

Wednesday 6th March 2019

మూడు సంవత్సరాల ర్యాలీ తర్వాత మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ గతేడాది నుంచి దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో ప్రతికూల రాబడులను ఇచ్చాయి. ఇక స్మాల్‌క్యాప్‌ సంగతి వేరే చెప్పక్కర్లేదు. మొదటి సారి గత నాలుగేళ్ల సగటు చారిత్రక పీఈ రేషియో కంటే తక్కువకు స్టాక్స్‌ లభిస్తున్నాయి. కనుక దీర్ఘకాలానికి పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకునే వారికిది అనువైన సమయంగా ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేష్‌జోషి పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక అంశాలు మిడ్‌,

భారీ లాభాలతో ముగింపు...11,000 సమీపం‍లో నిఫ్టీ

Tuesday 5th March 2019

డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో పాటు మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 379 పాయింట్లు లాభపడి 36,442 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 10,987 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు కావడంతో పాటు గత రెండు నెలల్లో  ఇంతస్థాయిలో సూచీలు లాభపడటం ఇదే మొదటిసారి. ఒక్క ఐటీ షేర్లలో తప్ప, మిగిలిన అన్ని రంగాలకు

Most from this category