STOCKS

News


1200 డాలర్ల దిగువన పసిడి

Monday 17th September 2018
Markets_main1537162086.png-20319

ప్రపంచ మార్కెటో సోమవారం పసిడి 1200 డాలర్ల దిగువన ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో నేడు ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 10: 15 గంటలకు ఔన్స్‌ పసిడి 2 డాలర్లు నష్టపోయి 1,199.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా 200 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై టారీఫ్‌లు నేటి రాత్రి(అమెరికా మార్కెట్లో) నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అటు డాలర్‌ ఇండెక్స్‌, ఇటు పసిడి ధర స్థిరంగా కదలుతున్నాయి. ‘‘ట్రంప్‌ చైనాపై సుంకాల విధింపునకే  మద్దతివ్వడంతో పసిడి ధర పెరగవచ్చు. వాణిజ్య యుద్ధ ప్రభావంతో ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపినట్లైతే పసిడి ధర 1230- 1240 డాలర్లకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పసిడి కొనుగోలుకు ప్రస్తుత ధర అనువైనది’’ అని షాన్డాంగ్ గోల్డ్ గ్రూప్ ఛీఫ్‌ అనలిస్ట్‌ జి మింగ్‌ తెలిపారు. అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మార్కెట్‌ విశ్లేషకులను మెప్పించడంతో అక్కడి మార్కెట్లో గత వారం చివరి రోజైన శుక్రవారం ఒకేరోజు 10డాలర్లు నష్టపోయి 1,201.10 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా పరుగులే..!
డాలర్‌ మారకంలో రూపాయి భారీ పతనంతో దేశీయ మార్కెట్లో సోమవారం పసిడి పరుగులు పెడుతోంది. ఎంసీఎక్స్‌లో  సోమవారం 10గ్రాముల పసిడి రూ. 213లు లాభపడి రూ.30649.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి రూ.30436.00ల వద్ద ముగిసింది.



You may be interested

27000 దిగువకు నిఫ్టీ బ్యాంక్‌ .!

Monday 17th September 2018

ముంబై:- రూపాయి పతనంతో పాటు అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సోమవారం ఉదయం సెషన్స్‌లో మార్కెట్‌ భారీగా నష్టపోయింది. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 493 పాయింట్లను, నిఫ్టీ 141 పాయింట్లను కోల్పోయాయి. బ్యాంకింగ్‌ షేర్ల పతనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీబ్యాంక్‌  సూచి 27వేల మార్కును కోల్పోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 1.50శాతం(420 పాయింట్లు)

పాలసీ ఉన్నా... కవరేజీ ఉండదు!  

Monday 17th September 2018

వైద్య బీమా ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు దీని పట్ల అవగాహన కూడా విస్తృతమవుతోంది. దీంతో వైద్య బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. భారీగా పెరిగిపోతున్న వైద్య ఖర్చులే పాలసీ వైపు అడుగులు వేయిస్తున్నాయి. అయితే పాలసీ తీసుకున్నంత మాత్రాన ఒక్క అనారోగ్య సమస్యకూ, చికిత్సా వ్యయాలకు బీమా రక్షణ ఉంటుందనుకోవద్దు. రక్షణ లేనివి కూడా కొన్ని ఉన్నాయి. అందుకోసం పాలసీ డాక్యుమెంట్‌ను

Most from this category