News


స్థిరంగా పసిడి

Wednesday 27th February 2019
Markets_main1551246251.png-24357

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత కారణంగా ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1.45డాలర్ల స్వల్ప లాభంతో 1,329.95 డాలర్ల ట్రేడ్‌ అవుతోంది. అమెరికా విడుదల చేసిన గణాంకాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పలు ప్రతికూలాంశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతిబంధకంగా మారాయి. అయినప్పటికీ.., వడ్డీరేట్ల పెంపుపై మరి కొంతకాలం సహనం పాటిస్తామని ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రకటించారు. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ స్తబ్ధుగా ట్రేడ్‌ అవుతూ 3వారాల కనిష్టస్థాయి 95.948 వద్దకు చేరుకుంది. పసిడి 1300 డాలర్ల వద్ద పటిష్టమైన నిరోధం కలిగి ఉంది. ఫెడ్‌ వైఖరీ పట్ల ఇన్వెస్టర్లు భిన్న వైఖరిని కలిగి ఉన్నారు. ఈ ఏడాది పసిడి 1,300- 1,400డాలర్ల ధర సమ్మతమైంది’’ అని​మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:- 
అంతర్జాతీయ మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర గత ముగింపు ధర(రూ.33367)తో పోలిస్తే రూ.38లు స్వల్పంగా పెరిగి రూ.33405.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

భారత్‌ భూభాగంలోకి పాక్‌ జెట్‌..మార్కెట్‌ వెనక్కి!

Wednesday 27th February 2019

గరిష్టస్థాయిల నుంచి వెనక్కి... జమ్మూ&కాశ్మీర్‌ సరిహద్దు ప్రాంతంలోని నౌషెరా సెక్టార్‌ భారత గగనతలంలోకి పాకిస్థాన్‌ జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చొచ్చుకొచ్చే ప్రయత్నాలను భారత వాయుసేవ తిప్పికొట్టిందని పీటీఐ వార్తలు వెలువడ్డా‍యి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చని ఆందోళనతో ఇన్వెస్టర్లు మార్కెట్‌లోంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా సూచీలు గరిష్టస్థాయిల నుంచి వేగంగా వెనక్కివస్తున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో దాదాపు 400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 300 పాయింట్లను, అలాగే 100 పాయింట్లు

ఆనంద్‌ రాఠి, జియోఫిన్‌ కామ్‌ట్రేడ్‌లకు సెబీ షాక్‌

Wednesday 27th February 2019

న్యూఢిల్లీ: నేషనల్‌ స్పాట్‌ ఎక్స్చేంజ్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఈఎల్‌) స్కామ్‌ నేపథ్యంలో  కమోడిటీ డెరివేటివ్స్‌ బ్రోకర్‌గా వ్యవహరించడానికి రెండు కంపెనీలకు సెబీ ఆమోదాన్ని నిరాకరించింది. ఆనంద్‌ రాఠి కమోడిటీస్‌, జియోఫిన్‌ కామ్‌ట్రేడ్‌లు... కమోడిటీ డెరివేటివ్స్‌ బ్రోకర్లుగా వ్యవహరించడానికి అర్హత లేదని సెబీ పేర్కొంది. ఈ మేరకు రెండు వేర్వేరు ఆదేశాలను సెబీ జారీ చేసింది. కమోడిటీ డెరివేటివ్స్‌ బ్రోకర్లుగా వ్యవహరించడానికి ఆనంద్‌ రాఠి కమోడిటీస్‌, జియోఫిన్‌ కామ్‌ట్రేడ్‌లు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించింది. ప్రత్యక్షంగా

Most from this category