STOCKS

News


5నెలల గరిష్టం వద్ద పసిడి

Monday 10th December 2018
Markets_main1544418611.png-22798

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 5నెలల గరిష్టస్థాయి వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు ఆసియాలో భారతవర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:10ని.లకు ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు స్వల్పంగా పెరుగుదలతో 1,254.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నవంబర్‌ నెలలో అమెరికా ఉపాధి గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు అవకాశాలు సన్నగిల్లడం తదితర కారణాలు పసిడి ధరకు అండగా నిలుస్తున్నాయి. డాలర్‌ మారకంలో యెన్‌, యూరోల విలువ పెరగడం, అమెరికా - చైనా దేశాల మధ్య ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు కొనసాగుతుండంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల పతనం సైతం కూడా పసిడి బలాన్నిస్తున్నాయి.
దేశీయంగానూ స్వల్పలాభాల్లో:-
డాలర్‌ మారకంలో రూపాయి నష్టాల ప్రారంభం దేశీయంగా పసిడికి కలిసొస్తుంది. నేడు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.35.00లు లాభపడి రూ.31630.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం పసిడి ధర రూ.31, 596 వద్ద ముగిసింది. గతవారంలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ దాదాపు 150 పైసలు బలహీనపడంతో పసిడి రూ.1335లు పెరిగిన సంగతి తెలిసిందే.



You may be interested

పెట్టుబడికి రేటింగ్‌ చూస్తారా?

Monday 10th December 2018

సినిమా చూసేముందు ఆ సినిమాకు రేటింగ్‌ ఎంతనేది చూస్తారు కొందరు!  కొందరైతే రెస్టారెంట్లకు వెళ్లేటపుడు కూడా దాని రేటింగ్‌, దానిపై ఇతరుల రివ్యూలు చూస్తారు!. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే రేటింగ్‌లు, రివ్యూలు చూసినపుడు... మరి మనం కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటపుడు ఇలాంటివి చూడొద్దా..? అసలు ఆ పెట్టుబడిలో రిస్కు ఎంత? రాబడి ఎంత? దాని గురించి దాన్ని జారీ చేస్తున్నవారు చెప్పే మాటల్లో నిజమెంత? ఇవన్నీ చెప్పేది

కొనదగిన 2 స్టాక్స్‌

Monday 10th December 2018

అరవింద్‌        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: కోటక్‌ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.100 టార్గెట్‌ ధర: రూ.130 ఎందుకంటే: అరవింద్‌ కంపెనీ మూడు కంపెనీలుగా విడిపోయింది. బ్రాండెడ్‌ దుస్తులు, రిటైల్‌ వ్యాపారాన్ని అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌(ఏఎఫ్‌ఎల్‌)గా,  ఇంజినీరింగ్‌ వ్యాపారాన్ని అనుప్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌(ఏఈఎల్‌)గా విడదీసింది. టెక్స్‌టైల్స్‌, అడ్వాన్స్‌ మెటీరియల్స్‌, ఇతర చిన్న వ్యాపారాలను ఆరవింద్‌ కంపెనీ చూసుకుంటుంది. డీమెర్జర్‌ ఫలితంగా మూడు లిస్టెడ్‌ కంపెనీలు తమ తమ వ్యాపార విభాగాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తాయి. ఏఎఫ్‌ఎల్‌,

Most from this category