STOCKS

News


రెండు వారాల గరిష్టానికి పసిడి

Thursday 22nd November 2018
Markets_main1542867415.png-22303

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం రెండు వారాల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఇటలీ బడ్జెట్‌ సంక్షోభానికి తెరపడుతుందనే అంచనాలతో యూరో బలపడటం, ప్రపంచమార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టడంలాంటి అంశాలు డాలర్‌కు ప్రతికూలంగా మారాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుపై సందిగ్ధత కూడా డాలర్‌పై ప్రభావాన్ని చూపుంది. డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో నష్టాలతో 96.712 వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ పతనంతో పసిడి ఫ్యూచర్లకి డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు పెరిగి 1,228.00డాలర్ల వద్ద ముగిసింది. నేడు ఆసియా మార్కెట్లో ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి గతముగింపు ధర(1,228.00)తో పోలిస్తే 0.01శాతం స్వల్పనష్టంతో 1,227.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా స్వల్పంగా లాభాల్లో:-
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం పసిడి ధర స్పల్పంగా లాభపడింది. నేటి ఉదయం గం.10:30ని.లకు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర క్రితం ముగింపు ధర(రూ.30825)తో పోలిస్తే రూ.25లు స్వల్ప లాభంతో రూ.30850.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి విలువ బలపడిన కారణంగా దేశీయ ధర తక్కువగా పెరిగింది.



You may be interested

నిఫ్టీకి 10,700 స్థాయి వద్ద నిరోధం

Thursday 22nd November 2018

నిఫ్టీ వరుసగా రెండు సెషన్లలోనూ నష్టాల్లోనే ముగిసిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రూపక్‌ తెలిపారు. ఇండెక్స్‌ ఇటీవలి కదలికలను గమనిస్తే.. 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ను అధిగమించిందని పేర్కొన్నారు. అలాగే 11,760 నుంచి 10,004 స్థాయికి పతనమైన తర్వాత 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి పైకి వచ్చేసిందని తెలిపారు. అయితే 10,004 స్థాయి నుంచి దాదాపు 8 శాతం వరకు పెరిగిన తర్వాత బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌

రైల్వేకు సర్వీస్‌ ప్రొవైడర్‌గా జియో

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేకు టెలికం సేవల ప్రొవైడర్‌ అవకాశాన్ని రిలయన్స్‌ జియో సొంతం చేసుకుంది. వచ్చే జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీనివల్ల రైల్వే టెలిఫోన్‌ బిల్లుల భారం కనీసం 35 శాతం మేర తగ్గి పోతాయని అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేకు గత ఆరేళ్లుగా భారతీ ఎయిర్‌టెల్‌ టెలికం సేవలు అందిస్తోంది. 1.95 లక్షల మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లను సీయూజీ కింద

Most from this category