STOCKS

News


నిలకడగా పసిడి ధర

Tuesday 25th September 2018
Markets_main1537850992.png-20542

డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా మంగళవారం పసిడి ధర నిలకడగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు ఔన్స్‌ పసిడి 1 డాలరు స్వల్పంగా నష్టపోయి 1,203.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు, రేపు (సెప్టెంబర్‌ 25, 26 తేదిల్లో) ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా-చైనా దేశాల అట్టుడుకుతున్న వాణిజ్య యుద్ధం పట్ల కూడా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ‘‘మార్కెట్‌ వర్గాలు ఊహించినట్లుగా ఫెడ్‌ కీలకవడ్డీ రేట్లను పెంచినట్లైతే డాలర్‌ విలువ పుంజుకుంటుంది. ఫలితంగా ప్రస్తుతం పసిడికి కీలక మద్దతు ధరగా ఉన్న 1200 డాలర్ల స్థాయి కోల్పోతుంది. ఈ తరువాత 1,194 డాలర్ల వద్ద కీలక అవరోధం ఉండవచ్చని’’ అని ఏపీటీసీ ట్రేడింగ్‌ హెడ్‌ స్టీఫెన్‌ అంటున్నారు. సోమవారం రాత్రి అమెరికా మార్కెట్ల మిశ్రమ ముగింపు కారణంగా అక్కడ ఔన్స్‌ పసిడి 1,204.40డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ స్వల్ప క్షీణత:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్‌లో మంగళవారం 10గ్రాముల పసిడి రూ.49.00లు నష్టపోయి రూ.30793.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కరోజే 43 పైసలు క్షీణించడంతో రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి రూ.260లు లాభపడి రూ.30842 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు పసిడి ఇన్వెస్టర్లు స్వల్పంగా లాభాల స్వీకరణకు పూనుకొని ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



You may be interested

టీవీఎస్‌ నుంచి స్టార్ సిటీ ప్లస్‌

Tuesday 25th September 2018

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ నేపథ్యంలో వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ సోమవారం టీవీఎస్‌ స్టార్ ‍సిటీప్లస్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 52,907 (ఢిల్లీ ఎక్స్‌షోరూం)గా ఉంటుందని వెల్లడించింది. 110 సీసీ సామర్ధ్యం గల ఈ మోటార్‌సైకిల్‌లో.. ముందు, వెనుక చక్రాలను ఏకకాలంలో మరింత సమర్ధమంతంగా ఆపగలిగే సిం‍క్రనైజ్డ్‌ బ్రేకింగ్ టెక్నాలజీ (ఎస్‌బీటీ) ఉందని కంపెనీ తెలిపింది. దీనివల్ల బైక్‌ స్కిడ్ కాకుండా..వాహనదారుకు మరింత భద్రత

ఐఎల్‌ అండ్ ఎఫ్‌ఎస్... తనే పరిష్కరించుకుంటుంది

Tuesday 25th September 2018

న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) తన సమస్యలను తానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వ్యాఖ్యానించారు. "ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. దానికంటూ స్వతంత్ర బోర్డు, షేర్‌హోల్డర్లు ఉన్నారు. కాబట్టి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తన సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆ సమర్ధత ఉందనే నేను

Most from this category