STOCKS

News


దేశంలో పెరిగి పసిడి ధర

Monday 22nd April 2019
Markets_main1555922165.png-25270

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 4నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో పసిడి ధర లాభాల బాట పట్టింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం పసిడికి మద్దతినిస్తుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.176.00 ర్యాలీ చేసి రూ.31639.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 6నెలల గరిష్టస్థాయికి చేరిన నేపథ్యంలో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 40పైసలు నీరసించి 69.75 వద్ద ప్రారంభమైంది. రూపాయి విలువకు వ్యతిరేకంగా ట్రేడయ్యే పసిడికి ఈ అంశం కలిసొచ్చింది. 
ప్రపంచమార్కెట్లో 4 నెలల కనిష్టం వద్దే...
ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు 4నెలల కనిష్టం వద్ద స్థిరంగా కదులుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా బలపడటం పసిడి ధర పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఆసియా మార్కెట్లో నేడు ఔన్స్‌ పసిడి ధర 2.35 డాలర్లు లాభపడి 1,278.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల అమెరికా ప్రకటించిన మొదటి త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో అక్కడి ఆర్థికవ్యవస్థ పుంజుకోవడాన్ని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో క్రమంగా పుంజుకుంటుంది. విశ్లేషకులు మాత్రం ఈ వారంలో పసిడి కనిష్టస్థాయి నుంచి రికవరి కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 6నెలల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లు మొగ్గు చూపవచ్చని వారంటున్నారు.



You may be interested

వేడెక్కుతున్న చమురు ధర

Monday 22nd April 2019

ఇరాన్‌- యూఎస్‌ సంక్షోభమే కారణం సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 2 శాతం పైగా లాభపడ్డాయి. ఇరాన్‌ చమురు దిగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికా, కొన్నిదేశాలకు తాత్కాలిక మినహాయింపులు ఇచ్చింది. తాజాగా ఈ మినహాయింపులను ఉపసంహరించుకునేందుకు రెడీగా ఉందని రాయిటర్స్‌ కథనం పేర్కొంది. దీంతో వారం ఆరంభంలో ఒక్కసారిగా చమురు ధరలు పైకి ఎగిశాయి. బ్రెంట్‌ క్రూడ్‌ దాదాపు 74 డాలర్లకు చేరువైంది. డబ్ల్యుటీఐ క్రూడ్‌ 65

15నెలల గరిష్ఠాలకు వీఐఎక్స్‌ సూచీ

Monday 22nd April 2019

మార్కెట్‌లో రిస్కుకు ప్రతిబింబంగా భావించే వీఐఎక్స్‌ సూచీ తాజాగా 15నెలల గరిష్ఠాలకు చేరింది. ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడడం, మార్కెట్లు గరిష్ఠస్థాయిల్లో కదలాడడంతో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీఐఎక్స్‌ పైపైకి పెరుగుతోంది. వీఐఎక్స్‌ పెరగడమంటే సాధారణంగా మార్కెట్లు త‍్వరలో కరెక‌్షన్‌ మూడ్‌లోకి వెళతాయనేందుకు సూచనగా భావిస్తారు. పుట్స్‌ ఎక్కువ కావడం, షార్ట్‌ బిల్డప్‌ జరగడం వంటివి వీఐఎక్స్‌ పెరిగే సమయంలో జరుగుతుంటాయి. లాంగ్స్‌కు హెడ్జింగ్‌ కోసం

Most from this category