STOCKS

News


వారం కనిష్టానికి పసిడి

Monday 15th April 2019
Markets_main1555304426.png-25126

అంతర్జాతీయ మందగమన ఆందోళనలు తగ్గముఖం పట్టడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం వారం రోజుల కనిష్టానికి పతనమైంది. ఆసియా మార్కెట్లో సోమవారం ఉదయం 3.25డాలర్లు క్షీణించి 1,291.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు మించి నమోదు కావడంతో పాటు ఇటీవల అమెరికా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం పట్టినట్లు విశ్లేషకులంటున్నారు. చైనా ఎగుమతి గణాంకాలు మార్చి నెలలో  5నెలల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. గతేడాది ఇదే మార్చి నెలతో పోలిస్తే 14.2శాతం అధికమని చైనీస్‌ కస్టమ్స్‌ తెలిపింది. ఎగుమతి గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో నేడు ఆసియాలో ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గింది. 
దేశీయంగా స్వల్ప పతనం:-
ఇక దేశీయ మార్కెట్లోనూ పసిడి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఉదయం ట్రేడింగ్లో 10గ్రాముల పసిడి ధర రూ.62లు నష్టపోయి రూ.31800.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 8పైసలు బలపడటం పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.



You may be interested

బంగారం పొదుపు పథకాల పట్ల జాగ్రత్త!

Monday 15th April 2019

మీ సొమ్ములకు ఎవరి హామీ ఉండదు! అనుమతి లేని డిపాజిట్‌ పథకాలను నిషేధించిన కేంద్రం నిబంధనల అడ్డుతో 11 నెలలకే పరిమితమైన బంగారం పథకాలు వీటి చెల్లుబాటుపై అస్పష్టత ఉందంటున్న నిపుణులు ఎవరి నియంత్రణ లేని పథకాలివి సమస్య ఎదురైతే పోలీసులే దిక్కు ముందస్తు వాణిజ్యంగా వీటిని పేర్కొంటున్న జ్యుయలర్లు బంగారు వర్తకులు ఆఫర్‌ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్‌గా లభించడం, ఎటువంటి తరుగు

నిఫ్టీ తక్షణ నిరోధం 11,710

Monday 15th April 2019

వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్‌, నిఫ్టీలు కొత్త రికార్డు సాధించినప్పటికీ, అటుతర్వాత ముందడుగు వేయలేకపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఇందుకు ఒక కారణమైతే, క్యూ4 ఫలితాల కోసం ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబించడం మరో కారణం. గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడిన ఐటి దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ల ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. ఈ ఫలితాలపై మార్కెట్‌

Most from this category