STOCKS

News


స్థిరంగా పసిడి

Wednesday 15th May 2019
Markets_main1557898878.png-25742

ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 1 డాలరు నష్టపోయి 1,295.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాషింగ్టన్‌ - బీజింగ్‌ల మధ్య వాణిజ్య చర్చలపై మళ్లీ ఆశలు చిగురించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. అలాగే డాలరుతో పాటు పలు ప్రపంచ ఈ‍క్విటీ మార్కెట్లు రికవరి బాట పట్టాయి. ఈ సోమవారం ఒక్కరోజులోనే పసిడి 20డాలర్ల లాభపడటంతో పాటు 1300డాలర్ల కీలక స్థాయికి చేరడంతో పసిడి ఫ్యూచర్లలో కొంత లాభాల స్వీకరణ జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఇన్వెస్టర్లు సంక్షోభ సమయాల్లో డాలర్‌ కొనుగోళ్లకే మొగ్గు చూపుతుండం పసిడి ర్యాలీకి అంతరాయం కలుగుతుంది. 1300డాలర్ల స్థాయి వద్ద పసిడి కీలక నిరోధస్థాయి కలిగి ఉందని హాంగ్‌కాంగ్‌కు చెందిన మార్కెట్‌ విశ్లేషకుడు పీటర్‌ ఫంగ్‌ తెలిపారు.
దేశీయంగా స్థిరంగా పసిడి ధర:- 
ప్రపంచమార్కెట్‌కు ట్రెండ్‌కు అనుగుణంగా పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.17ల స్వల్ప నష్టంతో రూ.32224.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడం పసిడి ర్యాలీకి అడ్డుకట్టవేస్తుంది.



You may be interested

కూరగాయల ధరల మంట!

Wednesday 15th May 2019

కూరగాయల ధరల మంట!  ఏప్రిల్‌లో  ఏకంగా 40.65 శాతం పెరిగిన టోకు ధరలు సూచీ మొత్తం చూస్తే, ద్రవ్యోల్బణం 3.07 శాతం 2018 ఏప్రిల్‌లో 3.62 శాతం ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు ఓకే న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టోకున కూరగాయల బాస్కెట్‌ ధరలు ఏప్రిల్‌లో 40.65 శాతం (2018 ఏప్రిల్‌ ధరలతో పోల్చి) పెరిగాయి. అయితే మొత్తంగా  టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యో‍ల్బణంలోని అన్ని విభాగాలనూ కలిపి చూస్తే,  ఏప్రిల్‌లో

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 15th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ కంపెనీ:- గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగమ్‌ టెండర్‌ దక్కించుకునేందుకు విజయవంతంగా బిడ్‌ పక్రియను పూర్తి చేసింది.  జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీ సీఈవో పదవికి వినయ్‌ దుబే రాజీనామా చేశారు. టోరెంటో పవర్‌:- ప్రైవేట్‌ పద్ధతితో రూ.270 కోట్ల విలువైన ఎన్‌సీడీల ఇష్యూను జారీ చేసింది.  ఆర్చిడ్‌ ఫార్మా:- రైస్‌డ్రోనేట్‌ సోడియం ఔషధాల విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. ఫ్యూచర్‌ సప్లై చైన్‌:-

Most from this category