STOCKS

News


పసిడికి డాలర్‌ ఎఫెక్ట్‌

Monday 1st October 2018
Markets_main1538369024.png-20728

డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా సోమవారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 4డాలర్లు మేర నష్టపోయింది.
ఫెడ్‌రిజర్వ్‌బ్యాంకు కీలక వడ్డీరేట్లను 2020 వరకు పలు విడతల్లో పెంచాలని  ప్రణాళికలు రూపోందించింది. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో గతవారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం 3వారాల గరిష్టానికి చేరుకుంది. నేడు 94.84 వద్ద స్థిరమైన ర్యాలీ చేస్తుంది.  భారత వర్తమాన కాలం ప్రకారం ఉదయం గం.10లకు ఔన్స్‌ పసిడి ధర 4.20డాలర్లు తగ్గి 1,191.90డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్‌ ముగింపు సమయానికి ఔన్స్‌ పసిడి 8.80 డాలర్లు లాభపడి 1,196.20 వద్ద ముగిసింది.
దేశీయంగా స్వల్ప తగ్గుదలే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పతనమైనప్పటికీ.., దేశీయంగా మాత్రం స్వల్పంగానే క్షీణించింది. ఎంసీఎక్స్‌లో సోమవారం 10గ్రాముల పసిడి రూ.10.00లు స్వల్పంగా నష్టపోయి రూ.30471.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  డాలర్‌ మారకంలో రూపాయి తగ్గుదల పసిడి క్షీణతను అడ్డుకుంటుంది. గతవారం ట్రేడింగ్‌ రోజైన శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 10గ్రాముల పసిడి రూ.30481వద్ద ముగిసింది.



You may be interested

రూపాయి ఎలా కదలొచ్చు

Monday 1st October 2018

♦రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 11 పైసలు లాభంతో 72.59 వద్ద ముగిసింది. రూపాయికి 72.95 కీలక నిరోధ స్థాయి అని, 72.04, 71.40 కీలక మద్దతు స్థాయిలని జియోజిత్‌ పేర్కొంది.  ♦ఎఫ్‌బీఐఎల్‌.. డాలర్‌కు రెఫరెన్స్‌ రేటును 72.54గా, యూరోకు రెఫరెన్స్‌ రేటును 84.44గా నిర్ణయించింది.  ♦సెప్టెంబర్‌ 21తో ముగిసిన వారంలో దేశీ ఫారెక్స్‌ నిల్వలు 1.3 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 401.79 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.  ♦దేశీ మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ డేటా సోమవారం విడుదల

రూపాయి డౌన్‌..

Monday 1st October 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం బలహీనంగా ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు ఎగయడం, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. రూపాయి సోమవారం 12 పైసలు క్షీణతతో 72.60 వద్ద ప్రారంభమైంది. కాగా రూపాయి శుక్రవారం 72.48 వద్ద ముగిసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు వచ్చే నెల 4న ఉంచి అమల్లోకి రానుండటం వల్ల బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట

Most from this category