News


తగ్గిన పసిడి

Saturday 19th January 2019
Markets_main1547885191.png-23682

గరిష్టస్థాయిల వద్ద స్వీకరణతో శుక్రవారం ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఏకంగా 10డాలర్లు నష్టపోయింది. అమెరికా మార్కెట్లో రాత్రి ఔన్స్‌ పసిడి ధర 10డాలర్ల నష్టపోయి 1282.60డాలర్ల వద్ద స్థిరపడింది. చైనా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య సత్సంబంధాలు మళ్లీ చిగురించవచ్చనే ఆశావహంతో ఆసియా, ఐరోపా, అమెరికా ఈక్విటీ మార్కెట్లు 1శాతానికి పైగా ర్యాలీచేశాయి. ప్రస్తుతం స్వల్పకాలానికి పసిడి ధరలో బేరిష్‌ క్యాండిల్‌ నెలకొన్నప్పటికీ.., అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌, ఐరోపాలో బ్రెగ్జిట్‌ అంశం, ఆసియాలో చైనా ఆర్థిక మందగమనం తదితర అంశాలు ధీర్ఘకాలంలో పసిడి ర్యాలీకి సహకరిస్తాయని విశ్లేషకులంటున్నారు. అలాగే 1276.50డాలర్ల వద్ద సాంకేతికంగా మద్దతు స్థాయి వుందని వారు గుర్తు చేస్తున్నారు. ఇక నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర 12డాలర్ల రేంజ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఇక వారం పరంగా చూస్తే... ఇది ఈ వారంలో 7డాలర్లు నష్టపోయి 1,280.10 - 1,296.60డాలర్ల స్థాయిలో కదలాడింది.
దేశీయంగా తగ్గుదలే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర క్షీణతకు దేశీయంగా సైతం లాభాల స్వీకరణ కారణంగా ఎంసీఎక్స్‌లో శుక్రవారం పసిడి ధర నష్టాలతో ముగిసింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.177లు నష్టపోయి రూ. 32091.00 వద్ద ముగిసింది.  వారంపరంగా చూస్తే రూపాయి అస్థిరత పసిడికి కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఈ వారంలో మొత్తం మీద రూ.163లు లాభపడింది.



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 21st January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి. ఎల్‌ అండ్ టీ:- తన షేర్లను బైబ్యాక్‌ చేయాలన్న నిర్ణయానికి అనుమతిచ్చేందుకు సెబీ( మార్కెట్‌ నియంత్రణ సంస్థ) నిరాకరించింది. బైబ్యాక్‌ ఆఫర్‌ కంపెనీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని సెబీ అధికారులు పేర్కోన్నారు. ఎల్‌ అండ్‌ టి మొత్తం 6.1 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయాలని భావించింది. ఒక్కో షేరుకు రూ. 1,475 చెల్లించాలని నిర్ణయించింది. ఈ లెక్కన ఈ

టయోటా కొత్త ‘‘కామ్రీ హైబ్రీడ్‌’’

Saturday 19th January 2019

ధర రూ.36.95 లక్షలు న్యూఢిల్లీ: టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తాజాగా ‘కామ్రీ హైబ్రీడ్‌’ కారు కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో శుక్రవారం విడుదలచేసింది. దీని ప్రారంభ ధర రూ.36.95 లక్షలుగా ఉంటుందని తెలిపింది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండే ఈ కారు లీటరుకు 23.27 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్స్‌, బ్రేక్ హోల్డ్ ఫీచర్ మొదలైనవి ఉన్నాయి. 2002లో కామ్రీ హైబ్రీడ్‌ను ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా

Most from this category