STOCKS

News


పసిడి 6నెలల గరిష్టం నుంచి పతనం

Thursday 20th December 2018
Markets_main1545283187.png-23098

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచడంతో పసిడి ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో మొదట ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తూ 8.50డాలర్ల పెరిగి 1,262.10 డాలర్ల వద్ద 6నెలల గరిష్టానికి తాకింది. అయితే రాత్రి  ఫెడ్‌ వడ్డీరేట్లను పావుశాతం పెంచడంతో పసిడి ధర 6నెలల గరిష్టస్థాయి(1,262.10 డాలర్లు) నుంచి దిగివచ్చింది. కీలక వడ్డీరేట్ల పెంపుతో డాలర్‌ పుంజుకోవడంతో పాటు ఆరునెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడం తదితర కారణాలు పసిడి ధరకు ప్రతికూలాంశాలుగా మారాయి. ఫలితంగా గరిష్టస్థాయి(1,262.10 డాలర్లు) నుంచి ఒకానొక దశలో 17డాలర్లు నష్టపోయి 1,245.35డాలర్ల వద్ద కనిష్టానికి పతనమైంది. చివరకు 1,256.40 డాలర్ల వద్ద ముగిసింది. నిన్నటి నష్టాల ముగింపునకు కొనసాగింపుగా నేటి ఆసియా ట్రేడింగ్‌లో పసిడి 10డాలర్ల భారీ నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం గం.10:25ని.లకు ఔన్స్‌ పసిడి ధర 7.85డాలర్లు నష్టపోయి 1248.60డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా అదే నష్టాల బాటలోనే:-
దేశీయంగా డాలర్‌ మారకలో రూపాయి తగ్గినప్పటికీ.., పసిడి ధర మాత్రం నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం దేశీయ మార్కెట్లో పసిడి పెరుగుదలను అడ్డుకుంటుంది. ఎంసీఎక్స్‌ మార్కెటో గురవారం 10గ్రాముల పసిడి ధర రూ.95.00లు నష్టపోయి రూ.31132.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.126లు నష్టపోయి రూ.31227ల వద్ద  ముగిసింది.



You may be interested

మారుతీ విక్రయ అంచనాల్లో కోత

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వాహన విక్రయ అంచనాలను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు 10-12 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలవని ఈ కంపెనీ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు ఈ అంచనాలను 8 శాతానికి తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ వెల్లడించారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం వంటివి దీనికి కారణాలని చెప్పారు. అమ్మకాలు బాగా

సాఫ్ట్‌బ్యాంక్ ‘రికార్డు’ ఐపీవో

Thursday 20th December 2018

టోక్యో: జపాన్ టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ భారీ పబ్లిక్ ఇష్యూతో (ఐపీవో) రికార్డు సృష్టించింది. ఐపీవో ద్వారా 2.65 లక్షల కోట్ల యెన్‌లు (సుమారు 23.5 బిలియన్ డాలర్లు) సమీకరించింది. జపాన్‌లో ఇది అతి పెద్ద ఐపీవో కాగా.. అంతర్జాతీయంగా భారీ పబ్లిక్ ఇష్యూల్లో రెండోది. 2014 నాటి చైనీస్ ఈకామర్స్ దిగ్గజం ఆలీబాబా ఐపీవో తర్వాత అంతటి భారీ పబ్లిక్ ఇష్యూ ఇదే. అప్పట్లో ఆలీబాబా సుమారు 25

Most from this category