STOCKS

News


వారంరోజుల గరిష్టానికి పసిడి ధర

Friday 21st September 2018
Markets_main1537507722.png-20434

ముంబై:- డాలర్‌ బలహీనతతో పాటు, అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్‌ వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రరూపం దాల్చడంతో పసిడి ధర శుక్రవారం వారంరోజుల గరిష్టానికి ఎగసింది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు  2.50 డాలర్లు లాభపడి 1,213.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 10-వారాల కనిష్ట ధర వద్ద ట్రేడ్‌ అవుతోంది. వచ్చేవారంలో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లను రక్షణాత్మక ధోరణిని అవలభిస్తున్నారు. ‘‘అమెరికా తెరలేపిన ట్రేడ్‌వార్‌ ఆ దేశానికి ఆత్మహత్యాసదృశ్యం. నిజానికి ఇది చైనా కంటే అమెరికాకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. డాలర్‌ ఇండెక్స్‌ పతనమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు పసిడి ట్రేడర్లు షార్ట్‌ పోజిషన్లు తీసుకుంటున్నారు. ఒకవేళ డాలర్‌ మరింత క్షీణిస్తే పసిడి ఫ్యూచర్లు షార్ట్‌ పొజిషన్లు మరింత ఎక్కువ అవుతాయి. తద్వారా పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. గత గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు  లాభాల్లో ముగిసిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లో పసిడి ఔన్స్‌ 1,211.30డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగా అదే ధోరణి:-  
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే పసిడి ధర దేశీయంగా పెరిగింది. ఎంసీఎక్స్‌లో నేడు 10 గ్రాముల పసిడి రూ.106.00లు లాభపడి రూ.30705.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

స్వల్పకాలానికి నిపుణుల సిఫార్సులు

Friday 21st September 2018

దేశీయ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వల్పకాలం కోసం ప్రముఖ బ్రోకరేజ్‌ నిపుణులు కొన్ని సిఫార్సులు అందిస్తున్నారు. చార్ట్‌ అడ్వైజ్‌ సీకే నారాయణ రికమండేషన్లు:  - గెయిల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 397. స్టాప్‌లాస్‌ రూ. 378. - ఎస్కార్ట్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 710. స్టాప్‌లాస్‌ రూ. 738. కునాల్‌ బాత్ర రికమండేషన్లు: - జేఎస్‌డబ్ల్యు స్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 430. స్టాప్‌లాస్‌ రూ. 408. - బలరామ్‌పూర్‌ చిని: కొనొచ్చు. టార్గెట్‌

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 21st September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యస్‌ బ్యాంక్‌:- యస్‌బ్యాంక్‌ సారధ్య బాధ్యతల నుంచి రాణా కపూర్‌ వచ్చే ఏడాది జనవరి కల్లా వైదొలగాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నేపధ్యంలో తదుపరి చర్యలపై చర్చించేందుకు బ్యాంకు బోర్డు డైరెక్టర్లు ఈ సెప్టెంబర్‌ 25న సమావేశం కానున్నారు. విప్రో టెక్‌:- యూరప్‌లో తన అనుబంధ సంస్థ విప్రో టెక్‌ ఆస్ట్రియాను విలీనం చేసుకునేందకు షేర్‌హోల్డర్లు అనుమతినిచ్చారు. టాటా మోటర్స్‌:- ఫిచ్‌ రేటింగ్‌

Most from this category