STOCKS

News


మిశ్రమంగా పసిడి ధర

Thursday 29th November 2018
Markets_main1543470450.png-22476

పసిడి ధర గురువారం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, దేశీయంగా మాత్రం నష్టాల బాట పట్టింది. పావెల్‌ వాఖ్యలతో డాలర్‌ ఇండెక్స్‌ వెనకడుగు వేయడంతో ప్రపంచ మార్కెట్లో పసిడి లాభపడింది. ఇక దేశీయంగా చూసినట్లైతే... రూపాయి ర్యాలీ పసిడి క్షీణతకు కారణమవుతోంది.
పావెల్‌ వాఖ్యలతో పసిడి ర్యాలీ:-
ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు సన్నగిల్లడంతో  పసిడికి కలిసొస్తుంది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు ర్యాలీ చేసింది. రాత్రి ఫెడ్‌రిజర్వ్‌ మినిట్స్‌ ప్రకటనలో ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ‘‘వడ్డీరేట్లు ప్రామాణిక స్థాయిలోనే ఉన్నాయి’’ అని వాఖ్యానించారు. పావెల్‌ వాఖ్యలతో రానున్నరోజుల్లో వడ్డీరేట్లు పెంపు ఉండదనే అంచనాకు ఇన్వెస్టర్లు వచ్చారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ నీరసించగా, ట్రెజరీ ఈల్డ్ తగ్గుముఖం పట్టింది. రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర అరశాతానికి(7 డాలర్లు)పైగా పెరిగి 1,227.40డాలర్ల వద్ద ముగిసింది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో కూడా అదే ధోరణి అవలంభిస్తూ 5డాలర్లు పెరిగి 1,232.40 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. భారత వర్తకాలమాలం ప్రకారం ఉదయంగం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి 3.30డాలర్లు పెరిగి రూ.1230.70డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా రూపాయి అడ్డుకట్ట:-
ప్రపంచమార్కెట్లో పసిడి ధర ర్యాలీ చేస్తున్నప్పటికీ, దేశీయంగా మాత్రం నీరసించింది. డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ పసిడి క్షీణతకు కారణమవుతోంది. పావెల్‌ వాఖ్యలతో డాలర్‌ ఇండెక్స్‌ వెనకడుగువేయడంతో రూపాయికి కలిసొచ్చింది. ఫలితంగా నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. రూపాయి బలపడటంతో పసిడి ఫ్యూచర్లకు దేశీయంగా డిమాండ్‌ తగ్గుతోంది. ఫలితంగా ఉదయంగం.10:30ని.లకు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి రూ.116.00 నష్టపోయి రూ.30318.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత రాత్రి ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.30434ల వద్ద ముగిసింది.



You may be interested

మన్మోహన్‌ హయాంలో వృద్ధి రేటుకు కోత

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వ హయాంలో జరిగినట్లు వెలువడిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు కేం‍ద్ర ప్రభుత్వం బుధవారం కోతపెట్టింది. ఈ తాజా గణాంకాలను చూస్తే, సంస్కరణలు ప్రారంభించిన అనంతరం దేశం ఎప్పుడూ రెండంకెల వృద్ధి సాధించలేకపోవడం గమనార్హం. పైగా వృద్ధి గణాంకాలు 9 శాతం దిగువకు పడిపోయాయి.   2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వెలువడిన ఈ తాజా గణాంకాలు రాజకీయ

రెన్యూవల్‌ ఎనర్జీలో వాటా విక్రయిస్తాం !

Thursday 29th November 2018

ముంబై:  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌ తన రెన్యూవల్‌ ఎనర్జీ వ్యాపారంలో వాటాను విక్రయించనున్నది. ఈ రెన్యూవల్‌ ఎనర్జీ విభాగంలో భాగంగా ఈ గ్రూప్‌ రెండు పవన విద్యుదుత్పత్తి ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం 873.5 మెగావాట్లు. ఇవి కాకుండా 104 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేసే ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ వ్యాపార విభాగంలో తమకున్న వాటాను విక్రయించే ప్రక్రియను ఆరంభించామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది.

Most from this category