STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Thursday 27th September 2018
Markets_main1538025709.png-20634

పసిడి ధరపై ఫెడ్‌ రిజర్వ్‌ ‘‘వడ్డీరేట్ల పెంపు ’’ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ స్థిరంగా ర్యాలీ చేస్తుంది. డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా పసిడి ధర లాభాల బాట పట్టింది. నేటి ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 3.10 డాలర్లు పెరిగి 1,202.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న రాత్రి ఫెడ్‌రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లు పావుశాతం పెంచిన నేపథ్యంలో అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 7.40డాలర్ల నష్టపోయి 1,194.70డాలర్లు వద్ద చేరుకుంది. ఇది పసిడి రెండు వారాల కనిష్టస్థాయి. అయితే మార్కెట్‌ ముగిసే సమయానికి 4.40 డాలర్లు రికవరీ అయ్యి 1,199.10 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయం స్వల్పంగా పెరుగుదల:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగినప్పటికి, దేశీయంగా మాత్రం స్వల్పంగానే పెరిగింది. ఎంసీఎక్స్‌లో గురువారం 10గ్రాముల పసిడి రూ.52.00లు స్వల్పంగా లాభపడి రూ.30645.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి బలపడేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం దాదాపు 19 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచింది. ఫలితంగా రాత్రి ఫారెక్స్‌మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో గతరాత్రి ఎంసీఎక్స్‌లో మార్కెట్లో 10గ్రాములు పసిడి రూ.209లు నష్టపోయి రూ.30510లు వద్ద ముగిసింది.



You may be interested

టైటాన్‌ 3శాతం జూమ్‌

Thursday 27th September 2018

ముంబై:- జువెలరీ, వాచ్‌ల విక్రయ సంస్థ టైటాన్ షేరు గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 3శాతం ర్యాలీ చేసింది. బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఎలాంటి సుంకాలను విధించికపోవడం షేరు ర్యాలీకి కారణమైంది. పెరిగిపోతున్న కరెంట్‌ ఖాతా లోటును నియంత్రించేందుకు, రూపాయి పతనాన్ని అడ్డుకట్టవేసేందుకు కేంద్రం బుధవారం 19రకాల దిగుమతులపై సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే మార్కెట్‌ వర్గాల అంచనాలకు భిన్నంగా ప్రభుత్వం బంగారం దిగుమతిలపై ఎలాంటి సుంకాలను విధించలేదు. ప్రస్తుతం

రెండేళ్లలో రూ.6,500 కోట్ల పెట్టుబడులు

Thursday 27th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) వరుసగా వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో రూ.6,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము ఖనిజ నిక్షేపాలు, ఉత్పాదనపై గత ఆర్ధిక సంవత్సంరంలో రూ.2,800 కోట్లు మూలధన వ్యయం వెచ్చించామని.. ఈ ఆర్ధిక సంవత్సరంలో (2019) రూ.3,185 కోట్లు, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో (2020) రూ.3,290 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ భజేంద్ర కుమార్‌ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన ఏజీఎం

Most from this category